BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 29 May 2026, 09:02 pm
Posted by : V శ్రీనివాస్

​సమగ్ర సవరణ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
29 May, 2026 - 09:02 PM
164 వీక్షణలు

రాష్ట్ర ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి

ముసాయిదా జాబితా రూపకల్పన - ఇంటింటి వివరాల సేకరణ

​ ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు-ఎన్నికల అధికారులు, ఈ ఆర్ ఓ లు, ఎ ఈ ఆర్ ఓ లకు సమగ్ర సవరణ కార్యక్రమం 2026 నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్యుపరేషన్ ఫారం నమోదు తర్వాత బూత్ స్థాయి అధికారులు వివరాలను పరిశీలించాలని, సరైన అర్హత గల ఓటర్ల ముసాయిరా జాబితా తయారుచేసి, నివేదికల పరిశీలించి హేతుబద్ధీకరించిన ముసాయిదా జాబితాను ప్రచురించాలని తెలిపారు. డూప్లికేట్ కార్డులను తొలగించడం, కంట్రోల్ టేబుల్, ఈ టేబుల్ నిర్వహణ, డాష్ బోర్డు & రిపోర్టింగ్, సు మోటో, ఫారం బి నోటి జనరేషన్, చిరునామా మార్పు మరణించిన వారి వివరాలను ఇంటింటి నుండి సేకరించి నిబంధనల ప్రకారం అర్హతలేని కార్డుల తొలగింపుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

​పూర్తి వివరాలతో ముసాయిదా జాబితా సిద్ధం చేయాలని, ముసాయిదా జాబితా ప్రచురణ అనంతరం అభ్యంతరాలు, ఫిర్యాదులు, దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించే దిశగా ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని, ఒక పోలింగ్ కేంద్రం పరిధిలోని కుటుంబానికి సంబంధించిన ఓటర్లు అందరూ ఒకే పోలింగ్ కేంద్రం పరిధి లోనికి వచ్చే విధంగా జాబితా రూపొందించాలని, ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల నుండి నియమించబడిన బూత్ స్థాయి ఏజెంట్ల సహకారం తీసుకోవాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడంలో అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని, అర్హత గల ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదరపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, మండలాల తహసిల్దార్లు ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.