BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 13 April 2026, 01:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సమయ పాలన పాటించకుంటే చర్యలు తప్పవు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Apr, 2026 - 01:47 PM
268 వీక్షణలు

సమయ పాలన పాటించకుంటే చర్యలు తప్పవు ఎంఈవో 1 మాసగిరి శ్రీనివాస్ 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో ఎంఈఓ ఆకస్మిక తనిఖీ

చాట్రాయి మండలంలోని చాట్రాయి మెయిన్, టి గుడిపాడు ఎస్సీ కాలని, మర్లపాలెం మెయిన్ మరియు ఉప్పరగూడెం పాఠశాలల్లో ఎంఈఓ 1 మాసగిరి శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలల రికార్డులను, ఉపాధ్యాయుల హాజరును, విద్యార్థుల హాజరును, మధ్యాహ్న భోజనం అమలు తీరు పరిశీలించారు. ఎంఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు పాఠశాల సమయాన్ని పాటించాలి, అనుమతి లేకుండా పాఠశాల బయటకు వెళ్లకూడదు, అలాగే ఎండల తీవ్రతను బట్టి విద్యార్థులను పాఠశాల సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు పంపరాదని హెచ్చరించారు. త్రాగునీరు అందుబాటులో ఉంచడం, పరీక్షలు పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్థులకు ప్రగతి పత్రాలు అందజేయాలని సూచించారు. మర్లపాలెం మెయిన్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం రుచి చూసిన ఎంఈఓ వంట వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇందిరాగాంధీ, అనూష, జయలక్ష్మి, సత్యనారాయణ పాల్గొన్నారు.