BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 30 March 2026, 05:54 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సూరంపాలెంలో పంచాయతీ స్థలం ఆక్రమణపై ఫిర్యాదు…

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Mar, 2026 - 05:54 PM
211 వీక్షణలు

సూరంపాలెంలో పంచాయతీ స్థలం ఆక్రమణపై ఫిర్యాదు… గ్రామానికి దారి మూసుకుపోతుందన్న ఆందోళన

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ శివారు సూరంపాలెం గ్రామంలో పంచాయతీ స్థలం ఆక్రమణ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గ్రామానికి చెందిన గుడిమళ్ల బ్రహ్మయ్య తన ఇంటి ప్రహరీ నిర్మాణంలో భాగంగా పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి, ఎస్సీ కాలనీకి వెళ్లే సిమెంట్ రోడ్డుకు ఆనించి నిర్మాణం చేపడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ నిర్మాణం కారణంగా సూరంపాలెం ఎస్సీ కాలనీకి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సుమారు 1500 జనాభా గల గ్రామానికి ప్రధాన దారి మూసుకుపోయే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.

ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన మర్సకట్ల శ్రీనివాసరావు సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)లో ఎండిఓకి అర్జీ సమర్పించారు. అక్రమంగా నిర్మిస్తున్న ప్రహరీని వెంటనే తొలగించాలని, లేదంటే గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, పంచాయతీ స్థలాన్ని కాపాడడంతో పాటు గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.