స్థానిక ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ కీలక లేఖ స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలు మోహరించాలి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వైఎస్సార్‌సీపీ లేఖ.. డీజీపీకి వినతిపత్రం పంపిన ఎస్‌ఈసీ
స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా కేంద్ర బలగాలను మోహరించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాసింది.
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలను ప్రస్తావిస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.
వైఎస్సార్‌సీపీ సమర్పించిన వినతిపత్రంపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా.. దానిని ఏపీ డీజీపీకి పంపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని డీజీపీకి సూచించారు.
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం సూచించినట్లు సమాచారం.