BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 19 August 2026, 09:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికైన తూమాటి మాధవరావుకు జగన్‌ అభినందనలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 09:57 PM
74 వీక్షణలు

శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికైన తూమాటి మాధవరావుకు జగన్‌ అభినందనలు

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి తనకు అవకాశం కల్పించినందుకు మాధవరావు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పదవికి గౌరవం తీసుకొచ్చేలా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు.

కుటుంబ సభ్యులతో కలిసి జగన్‌ను కలిసిన మాధవరావును ఈ సందర్భంగా జగన్‌ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఆయన విజయవంతంగా బాధ్యతలు నిర్వహించాలని ఆకాంక్షించారు.

అనంతరం వైఎస్సార్‌సీపీకి చెందిన శాసనమండలి సభ్యులు కూడా జగన్‌ను కలిశారు. తూమాటి మాధవరావు డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా ఆయనకు ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు.