BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 April 2026, 09:18 pm
Posted by : యామనూరి మల్లికార్జున

శిల్పా వ్యాఖ్యలు అవాస్తవం వాస్తవాలు గ్రహించాలి

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
04 Apr, 2026 - 09:18 PM
269 వీక్షణలు

శిల్పా వ్యాఖ్యలు అవాస్తవం వాస్తవాలు గ్రహించాలి. -టీడీపీ అంటే అభివృద్ధి - నష్యం ఫ్యామిలీ 

అభివృద్ధికి నిదర్శనం.. తెలుగుదేశం పార్టీ పాలన

వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు శిల్పా

శిల్పా వ్యాఖ్యలు అసత్యం - వాస్తవాలు గ్రహించాలి

రాయితీల పేరుతో ప్రజలకు మభ్యపెట్టడం తగదు

అధికార దాహం తప్ప.. ప్రజాక్షేమం లేదు

గడువు ముగిసినా భవనం ఖాళీ చేయకపోవడం సిగ్గుచేటు

నంద్యాల అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ నష్యం ఫ్యామిలీ

నంద్యాల ఏప్రిల్ 4 

నంద్యాల పట్టణ రూపురేఖలు మార్చింది, అభివృద్ధిని పరుగులు పెట్టించింది కేవలం తెలుగుదేశం పార్టీయే" అని టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ , నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు స్పష్టం చేశారు. శనివారం నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండిస్తూ గత వైసీపీ హయాంలో నంద్యాలలో అసలు అభివృద్ధి అన్నదే జరగలేదన్నారు . తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం రెండు సంవత్సరాల కాలంలోనే నంద్యాల నియోజకవర్గంలో ఊహించని రీతిలో అభివృద్ధి పనులు చేపట్టామని, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచామని గుర్తు చేశారు. శిల్పా సహకార్ లీజు గడువు ముగిసినప్పటికీ, ఇంకా ఆ భవనంలోనే కొనసాగడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. శిల్పా సహకార్ , శిల్పా మహిళా బ్యాంకు, శిల్పా రైతు సమాఖ్య వంటివన్నీ కేవలం తమ రాజకీయ ఉనికిని చాటుకోవడానికి పెట్టుకున్నవే తప్ప, వాటి వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. శిల్పా సహకార్ లో ఇచ్చే 5 నుంచి 10 శాతం రాయితీ కంటే, బయట ఉన్న సూపర్ మార్కెట్లలో 15 నుంచి 20 శాతం తక్కువ ధరకే సరుకులు లభిస్తున్నాయని, ఇది ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. శిల్పా సహకార్ పేరుతో మాదిరి పప్పులు, ఉప్పులు అమ్ముతూ ప్రజలను మభ్యపెడుతున్నారు కానీ నష్యం ఫ్యామిలీ కోట్లు విలువ చేసే స్థలాలను నంద్యాల అభివృద్ధికి ఉచితంగా ఇచ్చిందని. నంద్యాల అభివృద్ధి కేవలం నష్యం ఫ్యామిలీతోనే సాధ్యమైందని అన్నారు .శిల్పా రైతు సమైక్య కేవలం పేరుకే తప్ప, దానివల్ల రైతులకు జరుగుతున్న మేలు శూన్యం అని . రైతుల పేరు చెప్పుకుని రాజకీయ లబ్ధి పొందడం మానుకోవాలన్నారు. తెలుగుదేశం హయాంలోనే మార్కెట్ యార్డులు కళకళలాడాయిని . వైసీపీ హయాంలో నిర్వీర్యమైన వ్యవస్థలను మేము మళ్లీ గాడిలో పెడుతుంటే, ఓర్వలేక శిల్పా రవి రెడ్డి గారు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం రెండు ఎకరాల భూమిని తీసుకోవడం పూర్తిగా చట్టబద్ధంగా జరిగిందని,  వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా అక్రమంగా కాకుండా, రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాతే లీజుకు తీసుకోవడం  జరిగిందని తెలిపారు. నిబంధనల ప్రకారం అన్ని ప్రభుత్వ అనుమతులతో తీసుకున్న భూమిపై అసత్య ప్రచారాలు చేయడం శిల్పా రవి రెడ్డికి తగదని, వైసీపీ హయాంలో మాదిరిగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదని వారు మండిపడ్డారు

ఈ సమావేశంలో నంద్యాల మండల టీడీపీ కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి, గోస్పాడు మండల టీడీపీ కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి, అయ్యలూరు గ్రామ టీడీపీ అధ్యక్షులు త్రిలింగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొనినారు.