BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 March 2026, 12:16 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అర్చకులు.

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
22 Mar, 2026 - 12:16 PM
180 వీక్షణలు

గొల్లపల్లి: గొల్లపల్లి మండలం వేణుగుమట్ల - బొంకూర్ గ్రామాల్లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

​బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంత్రి సమీక్ష:

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఈనెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని మంత్రి ఆలయ కమిటీ సభ్యులకు మరియు అధికారులకు సూచించారు.

​ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు మరియు భక్తులు పాల్గొన్నారు.