BREAKING
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి ​బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి పరామర్శ బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి చిన్నంపేట, ఆరుగొలనుపేటలో మహానాడు వీక్షణకు భారీగా తరలిరావాలి ​కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రైతులు అపోహలు, వదంతులు నమ్మవద్దు: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త దారుణ హత్య! టమోట మార్కెట్ కు అనువైన స్థలాన్ని కేటాయించాలి ​జన్నారంలో అకాల వర్షం బీభత్సం: ఎస్.కె. గార్డెన్ పైకప్పు ధ్వంసం మంచిర్యాలలో అకాల వర్షం: ప్రజలకు ఉపశమనం.. రైతులకు ఆందోళన ​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి ​బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి పరామర్శ బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి చిన్నంపేట, ఆరుగొలనుపేటలో మహానాడు వీక్షణకు భారీగా తరలిరావాలి ​కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రైతులు అపోహలు, వదంతులు నమ్మవద్దు: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త దారుణ హత్య! టమోట మార్కెట్ కు అనువైన స్థలాన్ని కేటాయించాలి ​జన్నారంలో అకాల వర్షం బీభత్సం: ఎస్.కె. గార్డెన్ పైకప్పు ధ్వంసం మంచిర్యాలలో అకాల వర్షం: ప్రజలకు ఉపశమనం.. రైతులకు ఆందోళన
www.ntodaynews.com

శ్రీశైలం లో భ్రమరాంబికాకు సంప్రదాయ బద్దంగా కుంభోత్సవం

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
07 Apr, 2026 - 12:15 PM
60 వీక్షణలు

శ్రీశైలం లో భ్రమరాంబికాకు సంప్రదాయ బద్దంగా కుంభోత్సవం 

శ్రీశైలంలో సంప్రదాయబద్దంగా కుంభోత్సవం

లోకకల్యాణంకోసం శ్రీ భ్రమరాంబాదేవి వారికి ఈ రోజు (07.04.2026) సంప్రదాయబద్దంగా కుంభోత్సవం జరిపించబడుతోంది. 

ప్రతీ సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారాలలో     ( ఏ వారం ముందుగా వస్తే ఆ రోజు)  అమ్మవారికి సాత్వికబలిని సమర్పించేందుకు  ఈ విశేష ఉత్సవం నిర్వహించడం సంప్రదాయం.

ఈ ఉత్సవంలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నరాసి మొదలైనవి అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించడం  జరుగుతోంది.

కాగా ఈ ఉదయం జరిగిన కార్యక్రమాలలో కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకస్వాములు, వేదపండితులు, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

మొత్తం మీద ఈ ఉత్సవంలో  దాదాపు  20వేలకు పైగా గుమ్మడికాయలు,    5వేలకు పైగా కొబ్బరికాయలు, సుమారు లక్షకు పైగా నిమ్మకాయలు మరియు వండిన అన్నం (కుంభం) అమ్మవారికి సాత్త్వికబలిగా సమర్పించడం జరుగుతోంది.

ఈ ఉత్సవంలో  అధిక పరిమాణంలో  పసుపు, కుంకుమలను అమ్మవారికి సమర్పిస్తారు.             ఈ పసుపు,కుంకుమల సమర్పణకే “శాంతి ప్రక్రియ” అని పేరు.  

ఇక స్థానిక వ్యాపార సంఘం వారు గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, వండిన అన్నం అమ్మవారికి సాత్విక బలిగా సమర్పిస్తున్నారు.

కాగా కుంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం ప్రాత:కాల పూజల అనంతరం              శ్రీ అమ్మవారికి ఆలయ అర్చకులు నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర కుంకుమ పూజలను, పారాయణలను నిర్వహించారు. ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ అమ్మవారికి ఏకాంతంగా జరిపించబడ్డాయి.

తరువాత అమ్మవారి ఆలయంలో రజకునిచేత ప్రత్యేక ముగ్గు వేయించబడి శ్రీ చక్రం వద్ద విశేషపూజలు చేయబడ్డాయి. దీనికే రజకరంగవల్లి అని పేరు.

తరువాత సాత్త్వికబలికి సిద్ధం చేయబడిన కొబ్బరికాయలు, గుమ్మడికాయలకు పూజాదికాలు జరిపించబడ్డాయి. అనంతరం అమ్మవారికి కొబ్బరికాయలు, గుమ్మడికాయలు సమర్పించబడ్డాయి.

         ఈ మొదటి విడత సాత్త్విక బలి సమర్పణకు తరువాత హరిహరరాయగోపుర ద్వారం వద్ద గల మహిషాసురమర్దని అమ్మవారికి (కోటమ్మవారికి) ప్రత్యేక పూజాదికాలను జరిపించి సాత్త్వికబలిగా కొబ్బరికాయలు, గుమ్మడికాయలు సమర్పించబడ్డాయి.                                           

కాగా ఈ ఉత్సవాలలో భాగంగానే సాయంకాలం శ్రీమల్లికార్జునస్వామివారికి ప్రదోషకాల పూజల అనంతరం అన్నాభిషేకం జరిపించబడుతుంది.

స్వామివార్ల పూజల అనంతరం అమ్మవారి ఆలయానికి ఎదురుగా సింహమండపం వద్ద వండిన అన్నం కుంభరాసిగా వేయబడుతుంది.

తరువాత సంప్రదాయాన్ని అనుసరించి స్త్రీవేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతిని సమర్పించడంతో  ఉత్సవంలోని ప్రధాన ఘట్టం ప్రారంభమవుతుంది. తరువాత రెండో విడత సాత్విక బలి సమర్పించబడుతుంది.

చివరగా అమ్మవారికి ప్రత్యేక పూజలను చేసి పిండివంటలతో అమ్మవారికి మహానివేదన చేయడం జరుగుతుంది.

కాగా ఈ ఉత్సవంలో భాగంగానే గ్రామదేవత అంకాళమ్మకు కూడా ఈ ఉదయం ప్రత్యేక పూజలను నిర్వహించబడ్డాయి.