BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 26 March 2026, 01:58 pm
Posted by : యామనూరి మల్లికార్జున

శ్రీశైలం మల్లన్న దర్శనానికి ప్రముఖులకు ఆహ్వానం

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
26 Mar, 2026 - 01:58 PM
151 వీక్షణలు

శ్రీశైలం మల్లన్న దర్శనానికి ప్రముఖులకు ఆహ్వానం 

కార్యనిర్వహణాధికారివారి కార్యాలయం

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 

తేది:  26.03.2026

శ్రీశైలక్షేత్రాన్ని సందర్శించాలని కోరుతూ పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లుగా దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్‌నాయుడు తెలిపారు. 

ఇందులో భాగంగా పలువురు కేంద్రమంత్రులను, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను క్షేత్రానికి విచ్చేసి శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకోవాలని కోరుతూ ధర్మకర్తల మండలి తరుపున ఆహ్వానిస్తున్నట్లుగా పేర్కొన్నారు. 

అదేవిధంగా దాతలను ఆహ్వానించుటలో భాగంగా పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులను కూడా క్షేత్రాన్ని సందర్శించాలని కోరనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. 

ఇంకా వారు మాట్లాడుతూ ఇప్పటికే భక్తులరద్దీ రోజు రోజుకు పెరుగుతోందన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచేకాకుండా కర్ణాటక మహారాష్ట్రాలతో పాటు పలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా క్షేత్రాన్ని అధికసంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారన్నారు. అందుకే మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 

కాగా శ్రీశైలక్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదన్నారు. మరెక్కడాలేని విధంగా జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం ఒకే ఆలయ ప్రాంగణములో వెలసివుండడం ఈ క్షేత్రం యొక్క విశేషమని అన్నారు. అంతేకాకుండా శ్రీశైలం అనాదిక్షేత్రంగా కూడా ప్రసిద్ధమైందని కూడా పేర్కొన్నారు.  

అందుకే  క్షేత్రాన్ని మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందకు పలు చర్యలు చేపడుతున్నామన్నారు.  మాస్టర్‌ప్లాన్‌లో తుదిరూపానికి రూపొందించిన డి.పి.ఆర్.లో కూడా పలు ఆధ్యాత్మిక కట్టడాల నిర్మాణాలకుప్రతిపాదించడం జరిగిందన్నారు.

అదేవిధంగా క్షేత్రాభివృద్ధికి ఇతోధికంగా దాతల సహకారాన్ని  కూడా పొందడం జరుగుతుందని ఛైర్మెన్ పేర్కొన్నారు. 

( కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)

శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ