BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 14 February 2026, 03:55 am
Posted by : NTODAY NEWS OFFICIAL

భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష

తెలంగాణ
14 Feb, 2026 - 03:55 AM
402 వీక్షణలు
పాతాళగంగ వద్ద భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ సునీల్ షొరాణ్ సమీక్ష NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలోని పాతాళగంగ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బందోబస్తును జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ పరిశీలించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. ఎస్పీ మెట్ల మార్గం ద్వారా స్వయంగా పర్యటిస్తూ సంబంధిత సిబ్బందికి విధుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. మెట్ల మార్గం ద్వారా వెళ్లే భక్తులు అత్యంత జాగ్రత్తగా ఉండేలా అవగాహన కల్పించాలని, పుణ్యస్నానాల ప్రాంతంలో అధికారులు నిర్ణయించిన భద్రతా పరిమితులను ఎవరూ అతిక్రమించకుండా మైక్ ద్వారా నిరంతరం సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. బోటు ప్రయాణాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బోటు నిర్వాహకులు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతి ప్రయాణికుడు లైఫ్ జాకెట్ ధరించిన తర్వాతనే బోటులోకి అనుమతించాలని, భక్తుల ప్రాణ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయం, నంద్యాల #Srisailam #Mahashivaratri2026 #PatalaGanga #TempleSecurity #DevoteeSafety #NandyalPolice #BoatSafety #CrowdManagement Follow us on Website Facebook Instagram YouTube