BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 05 March 2026, 09:09 am
Posted by : NTODAY NEWS OFFICIAL

దత్తాత్రేయ స్వామివారికి విశేష పూజలు నిర్వహణ

తెలంగాణ
05 Mar, 2026 - 09:09 AM
349 వీక్షణలు
శ్రీశైలంలో దత్తాత్రేయ స్వామివారికి విశేష పూజలు నిర్వహణ NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద ఉన్న దత్తాత్రేయ స్వామివారికి గురువారం (05.03.2026) విశేష పూజలు నిర్వహించారు. లోకకల్యాణం కోసం ప్రతి గురువారం దేవస్థానం సేవగా ఈ పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. పూజా కార్యక్రమం ప్రారంభానికి ముందు మహాగణపతి పూజ నిర్వహించి అనంతరం దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాభిషేకం, విశేష పూజలు చేశారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే స్వరూపంగా అవతరించిన త్రిమూర్తి రూపమే దత్తాత్రేయ స్వామివారని పురాణాలు చెబుతున్నాయి. శ్రీశైల క్షేత్రంతో దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక సంబంధం ఉందని విశ్వసిస్తారు. ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద దత్తాత్రేయుడు తపస్సు చేసినట్లు విశ్వాసం ఉంది. అందువల్ల ఆ వృక్షాన్ని దత్తాత్రేయ వృక్షంగా పిలుస్తారు. దత్తాత్రేయ స్వామివారు కలియుగంలో గోదావరి తీరంలోని పిఠాపురంలో శ్రీపాద వల్లభుడిగా అవతరించినట్లు గురుచరిత్రలో పేర్కొనబడింది. అనంతరం మహారాష్ట్రలోని కరంజి నగరంలో నృసింహ సరస్వతి స్వామిగా జన్మించినట్లు కూడా చెబుతారు. నృసింహ సరస్వతి స్వామి మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించినట్లు గురుచరిత్రలో ప్రస్తావన ఉంది. నృసింహ సరస్వతి స్వామి తమ అవతార సమాప్తిని శ్రీశైలంలోని పాతాళ గంగలో చేసినట్లు పురాణాల్లో వివరించబడింది. (కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు శ్రీశైల దేవస్థానం ద్వారా జారీ చేసిన ప్రకటన) #Srisailam #DattatreyaSwamy #TempleRituals #SpiritualNews #AndhraPradeshTemples #SrisailamTemple #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube