BREAKING
thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం
Date of Publish : 14 January 2026, 09:20 am
Posted by : NTODAY NEWS OFFICIAL

క్రీడల వల్ల ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెరుగుతాయి

తెలంగాణ
14 Jan, 2026 - 09:20 AM
381 వీక్షణలు

క్రీడల వల్ల ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెరుగుతాయి: డీఎస్పీ శివరాం రెడ్డి

NTODAY NEWS: చిట్యాల క్రీడల వల్ల యువతలో ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెరుగుతాయని నల్గొండ జిల్లా డీఎస్పీ శివరాం రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో DYFI, SFI ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు కబడ్డీ ఆడి అక్కడి వారిని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, క్రీడలు శారీరక–మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని, యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుని ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించారు. క్రీడలతో భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. నేటి సమాజంలో యువత గంజాయి, డ్రగ్స్, ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి దురలవాట్లకు లోనవుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటోందని, వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తున్న డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులను ఆయన అభినందించారు. పాల్గొన్నవారు: ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, నార్కెట్పల్లి సీఐ నాగరాజు, ఎస్సై మామిడి రవికుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, వార్డు మెంబర్ నాతి కిరణ్, డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు పంది నరేష్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి అరూరి ప్రణీత్, నెలికంటి నరసింహ, నాతి వెంకటరామయ్య, దేశబోయిన లింగస్వామి, సురకంటి మోహన్ రెడ్డి, దేశబోయిన నరసింహ, బొంతల సాయి ప్రసాద్ రెడ్డి, బొడ్డుపల్లి శ్రీను, గోలి సాయికిరణ్, కునూరు గణేష్, శ్రీకాంత్, అరూరి పవన్, ఆరూరి నరసింహ తదితరులు పాల్గొన్నారు. #Kabaddi #YouthAndSports #DYFI #SFI #Nalgonda #Chityala #SankrantiSports #SayNoToDrugs #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube