BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

రైతులకు అండగా ఉండండి

తెలంగాణ
30 Oct, 2025 - 08:33 AM
214 వీక్షణలు
రైతులకు అండగా ఉండండి NTODAY న్యూస్: లక్ష్మిప్రసాద్ మెదక్ &సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 30 ★ ధాన్యం కొనుగోలు లో ప్రత్యేక శ్రద్ద* చూపించాలి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లాలో ఇప్పటివరకు 10,530 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని. సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని.. రైతులకి ఇబ్బందులు కలగకుండా యుద్ద ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు జరగాలని *జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం హవేలీఘన్పూర్ మండలం శాలిపేట్ గ్రామంలోని ఫ్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాసిల్దార్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంట నష్టం కాకుండా... అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి...ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్నారు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే తేమ శాతం చూసి కొనుగోలు చేయాలనీ..వర్షం వల్ల పూర్తిగా తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్ లకు తరలించాలన్నారు వాతావరణ దృష్ట్యా....రైతులు కూడా తేమ శాతం వచ్చాక నే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకరావాలాన్నారు తడిసిన ధాన్యం అరబెట్టుకునేందుకు టార్ఫాలిన్ లను ఇచ్చి రైతులకు సహకరించాలన్నారు నవంబర్ మొదటి వారం లో ఇంకా ఎక్కువ దాన్యం వచ్చే అవకాశం ఉంటుందని. ఈలోగా కేంద్రాలలో ఉన్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయిలో.వేగవంతం గా జరగాలన్నారు ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో.అధికారులు కూడా అంతే శ్రద్ధగా..బాధ్యతగా విధులు నిర్వహించాలని ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిపిఓ, స్పెషల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ పర్యవేక్షణ చేయాలని... ప్రతి కేంద్రంలో మూమెంట్ రిజిస్టర్ పక్కాగా నిర్వహణ జరిగేలా చూడాలన్నారు ప్రతి కేంద్రంలో ఫ్లెక్సీ పైన రాష్ట్ర, జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్లు తప్పక ప్రదర్శించాలన్నారు ట్రాక్ షీట్ అప్డేషన్ ఎప్పటికప్పుడు జరగాలని... ప్రతి కేంద్రంలో కనీస మౌలిక వసతులు ఉండాలన్నారు జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన అన్ని ధాన్యం కేంద్రాలలో... కొనుగోలు ప్రక్రియ సజావుగా జరగాలని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని... ప్రక్రియల . నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట హవేలీ ఘన్పూర్ తాసిల్దార్ సింధు రేణుక, రెవెన్యూ సిబ్బంది, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube