BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 29 March 2025, 11:13 am
Posted by : NTODAY NEWS OFFICIAL

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వృత్తిదారులకు ఇచ్చిన హామీలు అమలు కై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఫైళ్ళ ఆశయ్య రాష్ట్ర కో-కన్వీనరు

తెలంగాణ
29 Mar, 2025 - 11:13 AM
347 వీక్షణలు
బీసీ బడ్జెట్ సవరించాలి రూ:25 వేల కోట్లకు పెంచాలి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వృత్తిదారులకు ఇచ్చిన హామీలు అమలు కై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఫైళ్ళ ఆశయ్య రాష్ట్ర కో-కన్వీనరు తేదీ:29-3-2025, (శనివారం) భువనగిరి, తెలంగాణ చేతి వృత్తి దారుల సమన్వయ కమిటీ భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో దుంపల మల్లారెడ్డి ట్రస్టు భవనంలో బోలగాని జయరాములు అధ్యక్షతన జరిగిన బీసీ బడ్జెట్ సవరించాలని, రూ:25 వేల కోట్లకు పెంచాలని, ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా చేతి వృత్తుదారులకు ఇచ్చిన హామీ అమలు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ చేతి వృత్తి దారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కో- కన్వీనర్ పైళ్ళ ఆశయ్య మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పొందుపరిచిన హామీలను అధికారంలోకి వచ్చి ఆరు నెలల లోపే అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని అధికార వచ్చి ఏడాది పూర్తయినా కూడా ఏ ఒక్క హామీ అమలు చేయకుండా వెనకబడిన తరగతుల సంక్షేమని గాలికి వదిలిందని ఆశయ్య విమర్శించారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీ సంక్షేమానికి రూ:11,405కోట్లు మాత్రమే కేటాయించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం యాట 20వేల కోట్లు కేటాయిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడానికి వెంటనే బీసీ బడ్జెట్ సవరించి బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వివిధ ఫెడరేషన్లు సుమారు 20 పైగా ఏర్పాటు అయినటువంటి వాటికి పాలకవర్గా లేక ఫెడరేషన్ అన్ని కూడా నిర్లక్ష్యంగా ఉన్నాయని. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు దరఖాస్తు చేసినటువంటి వారందరికీ రూ:10 లక్షల వరకు వ్యక్తిగతరు రుణాలు అందిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని, వివిధ సొసైటీలకు రుణాలు 30 లక్షల వరకు అందించాలని, గీత,చేనేత కార్మికులకు ఇతర వృత్తిదారులందరికీ పెన్షన్లు పెంచుతామని ప్రభుత్వ విచ్చిన హామీని మరియు గీత కార్మికులకు సొసైటీలకు ఐదు 5ఎకరాల స్థలం, రెండో విడత గొర్రెల పంపిణి, చేనేత రజక,క్షౌర,మత్స్యకారులకు ఇతర వివిధ వృత్తిదారులకు, సంచార జాతులు సంక్షేమానికి ప్రభుత్వ వచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించాలి ఆశయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల జిల్లా కన్వీనర్ బొలగాని జయరాములు.మాజీ జిల్లా కన్వీనర్ మాటూరి బాలరాజు, గొర్ల మేకల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దయ్యాల నరసింహ, మద్దెపురం రాజు, రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్ ,క్షౌర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసాదం విష్ణు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నారం మల్లేశం, మత్స్య కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ పోతర బోయిన సత్యనారాయణ ,వృత్తి సంఘాల నాయకులు దూపటివెంకటేష్, గాజుల ఆంజనేయులు, ముదిగొండ కృష్ణ,అంతటి అశోక్, అవనిగంటి స్వామి, వడ్డేమాన్ రవి ,కట్ట మల్లేశం, ఎల్లంల సత్యనారాయణ, పాండాల మైసయ్య, పాక జహంగీర్ ,ఎరుకల బిక్షపతి, సిరికొండ దేవదాస్ ,మచ్చ భాస్కర్ ,మధ్యపురం బాల నరసింహ, కొక్కొండ లింగయ్య, గడ్డమీది సోములు. వడ్లకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు ఇట్లు: బోలగాని జయరాములు జిల్లా కన్వీనర్ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ