BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 13 December 2025, 09:47 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఫుడ్ పాయిజన్ కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

తెలంగాణ
13 Dec, 2025 - 09:47 AM
214 వీక్షణలు

మైనారిటీ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

NTODAY NEWS: హైదరాబాద్, ఎల్బీనగర్ నియోజకవర్గ రిపోర్టర్ పగడాల దేవయ్య హైదరాబాద్, బాగ్ లింగంపల్లిలోని మైనారిటీ బాలికల గురుకులంలో ఫుడ్ పాయిజన్ కు 32 విద్యార్థినిలకు సరైన వైద్యం అందించాలని, ఫుడ్ పాయిజన్ కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మైనారిటీ గురుకులాల్లో ఆహారపదార్థాల నాణ్యతపై నిరంతరం తనిఖీ చేయాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని మైనారిటీ బాలికల గురుకులంలో ఫుడ్ పాయిజన్ కు గురై కింగ్ కోఠీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం పరమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ మైనారిటీ గురుకులాల పట్ల ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని, ఆహారం, మౌళిక సదుపాయాలు సరిగా లేకపోవడం వలన, ఆహారం నాణ్యతపై తనిఖీ సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. అధికారులు అజాగ్రత్తతో పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్ (పాషా), ట్రేడ్ యూనియన్ నాయకులు శ్రావణ్, కిషన్, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube