BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 04 March 2026, 01:57 am
Posted by : NTODAY NEWS OFFICIAL

టపాసుల తయారీ, విక్రయాలపై కఠిన ఆంక్షలు

తెలంగాణ
04 Mar, 2026 - 01:57 AM
175 వీక్షణలు
టపాసుల తయారీ, విక్రయాలపై కఠిన ఆంక్షలు NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్రరాజు తనిఖీలు పూర్తయ్యే వరకు బాణసంచా కేంద్రాలు మూసివేయాలి: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మదనపల్లి,అన్నమయ్య జిల్లా: ప్రజల ప్రాణాల భద్రతే పోలీస్ శాఖ ప్రథమ కర్తవ్యమని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఇటీవల జరిగిన బాణసంచా ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలో టపాసుల తయారీ కేంద్రాలు మరియు విక్రయశాలలపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. తనిఖీలు పూర్తయ్యే వరకు జిల్లాలోని అన్ని బాణసంచా కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాలని ఎస్పీ ఆదేశించారు. సంయుక్త తనిఖీలు – ముమ్మర నిఘా జిల్లాలోని మదనపల్లి, రాయచోటి సబ్ డివిజన్ల పరిధిలో రెవెన్యూ మరియు అగ్నిమాపక శాఖలతో కలిసి పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అధికారులు పరిశీలిస్తున్న ముఖ్య అంశాలు లైసెన్సుల పరిశీలన: కేంద్ర ప్రభుత్వ సంస్థ పెట్రోలియం మరియు పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (PESO) నిబంధనల ప్రకారం బాణసంచా నిల్వ కేంద్రాలకు చెల్లుబాటు అయ్యే లైసెన్సులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. భద్రతా ప్రమాణాలు: గోడౌన్లలో ఇసుక, నీరు, అగ్నిమాపక యంత్రాలు తప్పనిసరిగా ఉండాలి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు నివారించేందుకు స్పార్క్-ప్రూఫ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీటీవీ నిఘా: ప్రతి బాణసంచా విక్రయశాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అనుసంధానించాలని ఆదేశించారు. పరిమితి మించితే సీజ్: అనుమతించిన పరిమితికి మించి బాణసంచా నిల్వ చేస్తే వెంటనే సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. తయారీ కేంద్రాల్లో పనిచేసే కార్మికులు సింథటిక్ దుస్తులు కాకుండా కాటన్ దుస్తులు ధరించాలని కూడా సూచించారు. ప్రజలు తమ పరిసరాల్లో ఎవరైనా అక్రమంగా టపాసులు నిల్వ చేస్తున్నట్లు గమనిస్తే డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి విజ్ఞప్తి చేశారు. #AnnamayyaDistrict #FirecrackerSafety #DheerajKunubilli #PoliceAlert #PublicSafety #APNews Follow us on Website Facebook Instagram YouTube