BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 06 February 2026, 11:11 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మహా శివరాత్రి జాతరకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

తెలంగాణ
06 Feb, 2026 - 11:11 AM
256 వీక్షణలు
మహా శివరాత్రి జాతరకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు ఫిబ్రవరి 14–16 తేదీల్లో ప్రత్యేక పోలీసు చర్యలు: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే NTODAY NEWS: రాజన్న సిరిసిల్ల జిల్లా మహా శివరాత్రి జాతరను పురస్కరించుకుని ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. భీమేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో భక్తుల సౌకర్యార్థం ఎంట్రీ–ఎగ్జిట్ మార్గాలు, క్యూలైన్ల ఏర్పాటు, ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. జనరల్, వీఐపీ, వీవీఐపీ పార్కింగ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండనున్న నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో దర్శనం జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారులపై రూట్ మ్యాప్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి భక్తులకు సులభంగా దర్శన మార్గాలు తెలిసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో రహదారులు, పార్కింగ్ సదుపాయాలు, క్యూలైన్ల క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్‌ఐ రాజు, ఆలయ ఈఈ రాజేష్, డీఈ మైపాల్ రెడ్డి, ఏఈ రామకృష్ణారావు, ఆలయ ఇన్‌స్పెక్టర్ ఎడ్ల శివసాయి తదితర అధికారులు పాల్గొన్నారు. #MahaShivaratri #TempleSecurity #PublicSafety #RajannaSircilla #PoliceArrangements #FestivalSecurity #CrowdManagement #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube