BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఆల‌య పున‌రుద్ద‌ణ ప‌నులు చేప‌ట్టాలి

తెలంగాణ
02 Dec, 2025 - 11:49 PM
357 వీక్షణలు

శ్రీ బొల్లుమార వెంకటేశ్వర స్వామీ ఆల‌య పున‌రుద్ద‌ణ ప‌నులు చేప‌ట్టాలి

కొండ‌వీడు కొండ‌పై ఉన్న దేవాయాల‌నికి చేరుకోవ‌డానికి ఘాట్ రోడ్డు నిర్మాణం చేప‌ట్టాలి జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి జిల్లా క‌లెక్ట‌ర్‌కు విన‌తి ప‌త్రం అంద‌జేత‌ NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా... చిల‌క‌లూరిపేట‌: కొండ‌వీడు కొండ‌పై కొలువై ఉన్న శ్రీ బొల్లుమార వెంకటేశ్వర స్వామీ దేవాల‌యానికి చేరుకోవ‌డానికి ఘాట్ నిర్మాణం చేయాల‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి కోరారు. ఆ గ్రామానికి చెందిన ప‌లువురు దేవాల‌యానికి ఘాట్ రోడ్డు నిర్మాణం చేప‌ట్టాల‌ని, స‌మ‌స్య‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ బాలాజిని క‌లిశారు. విష‌యంపై స్పందించిన బాలాజి గ్రామ‌స్తుల‌తో క‌ల‌సి డిప్యుటీ సి ఎమ్, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెల్లాలని జనసేన జనవాణిలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శ్రీనివాస్ రావు కి అర్జీ అందించారు. ఈ సంద‌ర్బంగా బాలాజి మాట్లాడుతూ య‌డ్ల‌పాడు మండ‌లం కొండవీడు కొండలలోని కొండపై వేంచేసి యున్న శ్రీ బొల్లుమార వెంకటేశ్వర స్వామీ వారి ఈ దేవాలయం శ్రీ కృష్ణ దేవరాయలు కాలంలో నిర్మించబడిన అతి ప్రాచీన దేవాల‌యం అని వివ‌రించారు. ఈ దేవాలయానికి చేరుకోవ‌డానికి సరైన మెట్ల దారి లేదని, అయినా స్వామీ వారిని చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు దర్శించుకుంటూ ఉంటారని తెలిపారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో స్వామివారికి గ్రామస్తులందరు కలసి కళ్యాణం జరిపించి అన్న ప్రసాద వితరణ కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నార‌ని తెలిపారు. గ‌తంలో ఘాట్ రోడ్డు నిర్మాణం గ్రామ‌స్తులే స్వ‌యంగా దారిని క్లీన్ చేస్తుండ‌గా అటవీ శాఖ అధికారులు ఘాట్ రోడ్డునకు అనుమ‌తి లేదని నిలిపివేశార‌ని గుర్తు చేశారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే స్వామి వారికి ఘాట్ రోడ్డు నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొని వస్తామని గ్రామ పార్టీ నేత‌లు మొక్కుకొని ఉన్నార‌ని వెల్ల‌డించారు. శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కూడా శాయ శక్తులా కృషి చేస్తున్నారని తెలిపారు. ఆధ్యాత్మికంగా అతి ప్రాచీన మైన శ్రీ బొల్లుమార వెంకటేశ్వర స్వామీ దేవాల‌యాన్ని పునఃరుద్ద‌రించి, స్వామి దేవాలయానికి ఘాట్ రోడ్డు నిర్మాణమునకు తగు అనుమతులు ఇప్పించి మాట్ రోడ్డు నిర్మాణ పనులు వచ్చే స్వామివారి కళ్యాణం నాటి పూర్తి చేసేలాగా చేయాల‌ని కోరారు. కార్య‌క్ర‌మంలో కార్య‌క్ర‌మంలో య‌డ్ల‌పాడు మండల ఉపాధ్యక్షులు మేకల రామారావు, మండల ప్రదాన కార్యదర్శి పాపన హనుమంత రావు, కొత్తపాలెం గ్రామ ప్రధాన కార్యదర్శి పల్లె ఆదిబాబు, ఐలం హరిబాబు, కాకాని వెంకటేశ్వర రావు తదిత‌రులు ఉన్నారు. Follow us on Website Facebook Instagram YouTube