BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 29 March 2026, 10:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తాతయ్య జ్ఞాపకార్థం 50 వేల విరాళం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 10:30 PM
185 వీక్షణలు

తాతయ్య జ్ఞాపకార్థం 50 వేల విరాళం — ఆలయ అభివృద్ధికి మాగంటి నాని ముందడుగు

నరసాపురంలో దాతృత్వ కార్యక్రమం

విస్సన్నపేట మండలంలోని నరసాపురం శ్రీ సూర్యలక్ష్మీనారాయణ దేవాలయం అభివృద్ధి కోసం టిడిపి యువ నాయకుడు మాగంటి సత్యనారాయణ చౌదరి మనువడు మాగంటి నాని (సత్యనారాయణ చౌదరి) 50,000 రూపాయల విరాళాన్ని అందించారు. ఈ విరాళాన్ని ఆలయ ధర్మకర్త గోటేటి సుబ్రహ్మణ్యేశ్వర రావుకు అందజేశారు.

ఈ సందర్భంగా మాగంటి నాని మాట్లాడుతూ తమ తాతయ్య జ్ఞాపకార్థం ఆలయ అభివృద్ధికి సహాయం చేయడం తనకు ఎంతో సంతోషకరమని తెలిపారు. తమ కుటుంబం నిత్య దేవతారాధనలో విశ్వసిస్తుందని, తాము సంపాదించిన ఆదాయంలో కొంత భాగాన్ని దైవ కార్యాలకు వినియోగించాలన్నది తన తండ్రి శోభన ప్రసాద్ ఆచరణ అని పేర్కొన్నారు. ఆ ఆశయాలను తాను కొనసాగిస్తున్నానని చెప్పారు.

“మానవ సేవే మాధవ సేవ” అనే భావనతో ముందుకు సాగితే జీవన మార్గంలో మంచి పరిచయాలు ఏర్పడతాయని, మనం చేసే సేవలే మనకు ఆశీస్సులుగా మారుతాయని నాని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమానికి నాని నానమ్మ సుభాషిణి, బాబాయి ప్రసాద్తో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వారు ఆలయాన్ని దర్శించి ప్రతి దేవతామూర్తులకు పూలమాలలు సమర్పించి, పసుపు కుంకుమలు, జాకెట్ ముక్కలు, పూజా సామాగ్రి అందజేశారు. ఆలయ పూజారులకు కూడా వస్త్రాలు, కానుకలు సమర్పించారు.

ధర్మకర్త గోటేటి సుబ్రహ్మణ్యేశ్వర రావు మాట్లాడుతూ మాగంటి కుటుంబం దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తోందని ప్రశంసించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టు శాలువాలతో సత్కరించి వేద ఆశీర్వాదాలు అందించారు.

ఈ కార్యక్రమం ఘనంగా, భక్తిశ్రద్ధలతో సాగింది. తెలుగుదేశం పార్టీ నాయకుల సాన్నిధ్యంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి.