BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 April 2026, 03:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తడికలపూడి పోలీస్ స్టేషన్‌కు తొలి మహిళా ఎస్సైగా వల్లి పద్మ బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 03:14 PM
189 వీక్షణలు

తడికలపూడి పోలీస్ స్టేషన్‌కు తొలి మహిళా ఎస్సైగా వల్లి పద్మ బాధ్యతలు స్వీకారం

ఏలూరు జిల్లాలోని కామవరపుకోట మండలం తడికలపూడి పోలీస్ స్టేషన్‌కు నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా వల్లి పద్మ శనివారం బాధ్యతలు స్వీకరించారు.

తడికలపూడి పోలీస్ స్టేషన్ చరిత్రలో తొలిసారిగా మహిళా ఎస్సైగా బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పరిణామం పోలీస్ శాఖలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

స్థానిక ప్రజలతో సమన్వయం పెంచుకుంటూ, చట్టం మరియు శాంతి భద్రతలను కాపాడేందుకు కృషి చేస్తానని వల్లి పద్మ తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తానని స్పష్టం చేశారు.

మహిళా అధికారిణిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా మహిళల సమస్యల పరిష్కారంలో మరింత స్పందన చూపే అవకాశముందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.