BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 30 May 2026, 07:10 pm
Posted by : కూనురు మధు

తెలంగాణ ఉద్యమకారుల వేదిక నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా పల్లపు బుద్ధుడు నియామకం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
30 May, 2026 - 07:10 PM
263 వీక్షణలు

తెలంగాణ ఉద్యమకారుల వేదిక నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా పల్లపు బుద్ధుడు నియామకం

తెలంగాణ ఉద్యమకారుల వేదిక (టీయూవీ) నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా మలి దశ ఉద్యమకారుడు పల్లపు బుద్ధుడిని నియమించారు. ఈ మేరకు శుక్రవారం సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ, రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్‌లు అధికారిక నియామక పత్రాన్ని  జారీ చేశారు. చిట్యాల మండలం ఉరుమడ్ల  నివాసి అయిన పల్లపు బుద్ధుడు సుదీర్ఘ కాలంగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఆయన నియామకం పట్ల సంస్థ నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది. ​హామీల సాధన కోసం పోరాడాలి ​ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ నరాల సత్యనారాయణ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఉన్న నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాల్సిన బాధ్యత కొత్త కమిటీపై ఉందన్నారు. ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నిజమైన లబ్ధిదారులకు అందేలా చూసేందుకు, అవి అమలు అయ్యేంత వరకు నిరంతరం పోరాడాలని పల్లపు బుద్ధుడికి దిశానిర్దేశం చేశారు. ​తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు పల్లపు బుద్ధుడు సంస్థ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ఉద్యమకారులందరినీ ఏకం చేసి, వారి హక్కుల సాధన కోసం నమ్మకంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. ఆయన నియామకం పట్ల పలువురు ఉద్యమకారులు మరియు స్థానికులు అభినందనలు తెలియజేశారు.