BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 31 March 2026, 01:39 am
Posted by : యామనూరి మల్లికార్జున

తిమ్మాపురం మోడల్ స్కూల్ లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకారణం ప్రక్రియ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
31 Mar, 2026 - 01:39 AM
262 వీక్షణలు

తిమ్మాపురం మోడల్ స్కూల్ లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

స్థానిక తిమ్మాపురం ఆదర్శ పాఠశాల (AP Model School) లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపాల్ లక్ష్మణరావు తెలిపారు. పదవ తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఇంగ్లీష్ మీడియం లో ఎంపిసి, బైపిసి, ఎంఈసీ మరియు సీఈసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించబడతాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ 30, 2026 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ ప్రవేశ ప్రక్రియలో ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్ నిబంధనలు ప్రకారం సీట్లు కేటాయించబడతాయి. ఎంపికైన విద్యార్థుల జాబితాను మే 5న ప్రకటించి, మే 6న ధృవీకరణ పత్రాల పరిశీలన చేపడతారని తెలిపారు.ఈ పాఠశాలలో చేరిన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు అత్యాధునిక ల్యాబ్, లైబ్రరీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఐఐటి-జెఈఈ (IIT-JEE) మరియు నీట్ (NEET) వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం 'మిషన్ మోడల్ మైండ్స్' (Mission Model Mindz) ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఎటువంటి ఆఫ్-లైన్ దరఖాస్తులు స్వీకరించబడవు, కావున అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ లోనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఓసి, బిసి విద్యార్థులకు 200 మరియు ఎస్సి, ఎస్టీ విద్యార్థులకు 150 రూపాయలుగా ప్రభుత్వం ఫీజు నిర్ణయించిందన్నారు. మరింత సమాచారం కోసం పాఠశాల కార్యాలయాన్ని సంప్రదించవచ్చన్నారు.