BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 19 March 2026, 10:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు హెడ్ కానిస్టేబుల్‌ రాజబోయిన రామచంద్ర రావు కు కేంద్ర సత్కారం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 10:18 PM
222 వీక్షణలు

తిరువూరు హెడ్ కానిస్టేబుల్‌ రాజబోయిన రామచంద్ర రావు కు కేంద్ర సత్కారం

తిరువూరు పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాజబోయిన రామచంద్రరావు పేరు ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం విధులు నిర్వహించడమే కాకుండా, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిన ఈ పోలీస్ అధికారి సేవలకు కేంద్ర ప్రభుత్వం “ఉత్తిష్ట సేవ పథకం” కింద గౌరవం ప్రకటించడం విశేషం.

కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా అందరికీ అండగా నిలిచే రామచంద్రరావు… సమస్య వచ్చినప్పుడల్లా ముందుండే పోలీస్‌గా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకూ ఆయన సేవల గురించి మాట్లాడుకుంటున్నారు.

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామానికి చెందిన రామచంద్రరావు… వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి, కష్టపడుతూ కానిస్టేబుల్‌గా ప్రారంభించి, హెడ్ కానిస్టేబుల్‌గా ఎదిగిన ప్రయాణం చాలా మందికి ప్రేరణగా నిలుస్తోంది.

“మన ఊరి వ్యక్తి దేశ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణం” అంటూ స్వగ్రామ ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఆయనకు వచ్చిన ఈ గౌరవం భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు దారి తీస్తుందని స్థానికులు భావిస్తున్నారు.

పోలీస్ డ్రెస్‌లో సేవ… ప్రజల గుండెల్లో స్థానం – ఇదే రామచంద్రరావు స్టోరీ!