BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 01 August 2026, 03:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో రేషన్ షాప్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్‌డీఓ ఎ. కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 03:20 PM
73 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని రేషన్ షాప్ నెం. 613038ను రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ. కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ బియ్యం నాణ్యత, నిల్వలు, పంపిణీ విధానం, ఈ-పాస్ యంత్రం పనితీరు, స్టాక్ రిజిస్టర్లు, తూకం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆర్‌డీఓ స్వయంగా రేషన్ బియ్యం నాణ్యతను పరిశీలించి, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన బియ్యాన్ని మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డీలర్‌కు సూచించారు. అలాగే రేషన్ కోసం వచ్చిన లబ్ధిదారులతో మాట్లాడి బియ్యం నాణ్యత, తూకం, పంపిణీ సమయాలు, బయోమెట్రిక్ సేవలపై వివరాలు తెలుసుకున్నారు.

రేషన్ షాప్‌లో స్టాక్ బోర్డు, ధరల పట్టిక, నిల్వల వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా రేషన్ సరుకుల పంపిణీ నిర్వహించాలని, ఎలాంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో నాణ్యమైన రేషన్ సరుకులు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆర్‌డీఓ ఎ. కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.