BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 19 March 2026, 07:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో ఉగాది సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేతకు ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 07:56 PM
150 వీక్షణలు

తిరువూరులో ఉగాది సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేతకు ఘన సన్మానం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరులో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఆర్‌టీసీ రామారావు (రంగినేని రామారావు) ని ఆయన పార్టీకి చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఘనంగా సన్మానించారు.

తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు రామారావు కి నూతన వస్త్రాలు బహుకరించి సత్కరించారు. పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని నాయకులు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో తిరువూరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు ప్రకాశరావు, పట్టణ అధ్యక్షుడు జీవన్ బాబు, మండల అధ్యక్షుడు పల్లెపాటి శ్రీనివాసరావు, గంజా కృష్ణమోహన్, కొత్తగుండ్ల గోపాలకృష్ణ, కె.ఎల్. రావు, గంధం శ్రీనివాసరావు, కుంచం చందర్రావు, కుంచం దినేష్ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై రామారావు కి శుభాకాంక్షలు తెలియజేశారు.