BREAKING
thumb చోడవరంలో రాజకీయ వేడి.. thumb వైఎస్సార్‌సీపీలో చేరిన వీరభద్ర కాలనీ యువకులు thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb చోడవరంలో రాజకీయ వేడి.. thumb వైఎస్సార్‌సీపీలో చేరిన వీరభద్ర కాలనీ యువకులు thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం
Date of Publish : 04 August 2026, 05:18 pm
Posted by : CHERUKU RAMESH

తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ

తెలంగాణ
/ నల్గొండ / శాలిగౌరారం
Reporter
CHERUKU RAMESH శాలిగౌరారం మండల ఇన్వెస్టిగేషన్ ప్రతినిధి
04 Aug, 2026 - 05:18 PM
101 వీక్షణలు

తక్కెళ్ళపహాడ్‌లో జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం

తక్కెళ్ళపహాడ్ | NTODAY NEWS

తక్కెళ్ళపహాడ్ అంగన్‌వాడీ కేంద్రంలో జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కట్టంగురి సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిడ్డ పుట్టిన గంటలోపు తొలి ఆహారంగా ముర్రుపాలు (కొలస్ట్రం) తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. ముర్రుపాలు శిశువుకు సహజ రోగనిరోధక శక్తిని పెంపొందించి, ఆరోగ్యవంతమైన జీవితానికి బలమైన పునాది వేస్తాయని తెలిపారు.

అనంతరం ICDS సూపర్‌వైజర్ సునీత మాట్లాడుతూ, శిశువుకు తొలి ఆరు నెలల పాటు పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలని, ఆ తర్వాత తల్లిపాలతో పాటు అదనపు పోషకాహారాన్ని ప్రారంభించాలని సూచించారు. బిడ్డకు రెండు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు తల్లిపాలను కొనసాగించడం వల్ల శారీరక, మానసిక ఎదుగుదలతో పాటు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్టంగురి సురేందర్ రెడ్డి, ICDS సూపర్‌వైజర్ సునీత, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.