BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 23 March 2026, 11:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తల్లిదండ్రులకు రక్షణగా “పేరెంట్స్ సపోర్ట్ బిల్లు”

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 11:20 PM
165 వీక్షణలు

తల్లిదండ్రులకు రక్షణగా “పేరెంట్స్ సపోర్ట్ బిల్లు”  తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

హైదరాబాద్, మార్చి 23: వృద్ధ తల్లిదండ్రుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. “పేరెంట్స్ సపోర్ట్ బిల్లు”కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లు రూపుదిద్దుకుంది.

ఈ బిల్లు ప్రకారం తల్లిదండ్రులను చూసుకోని ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగుల జీతాల నుంచి 15 శాతం లేదా రూ.10,000 (ఏది తక్కువైతే అది) కోత విధించి, ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రులకు అందించే విధానం అమలు చేయనున్నారు.

ఫిర్యాదుల ఆధారంగా సంబంధిత అధికారుల ద్వారా విచారణ జరిపి, నిర్లక్ష్యం నిర్ధారణ అయిన పక్షంలోనే ఈ కోత అమలు అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వృద్ధుల ఆర్థిక భద్రతను బలోపేతం చేయడంతో పాటు కుటుంబ విలువలను కాపాడటం ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొంది.

ఈ నిర్ణయంతో వృద్ధ తల్లిదండ్రులకు మరింత రక్షణ లభిస్తుందని, కుటుంబ బాధ్యతలపై సమాజంలో చైతన్యం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.