BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
01 Apr, 2026 - 04:45 PM
110 వీక్షణలు

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

​రాష్ట్రంలో అమలులోకి "తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల సంరక్షణ మరియు పర్యవేక్షణ చట్టం 2026"

​జగిత్యాల: అనేక కష్టనష్టాలకు ఓర్చి పిల్లలను ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చిందని రాష్ట్ర వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

​చట్టంలోని ముఖ్యాంశాలు:

​60 రోజుల్లో పరిష్కారం: బాధిత తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన 60 రోజుల్లోనే విచారణ జరిపి న్యాయం చేసేలా ఈ చట్టం రూపొందించబడింది.

​అందరికీ వర్తిస్తుంది: ఈ చట్టం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు మరియు ప్రజాప్రతినిధులకు సైతం వర్తిస్తుంది.

​పోలీసుల సహకారం: చట్టాన్ని పక్కాగా అమలు చేయడానికి పోలీసుల సహకారం తీసుకోవాలని, దీనిపై రాష్ట్ర డీజీపీతో పాటు జిల్లా పోలీసు అధికారులకు లేఖ రాయనున్నట్లు మంత్రి తెలిపారు.

​ముఖ్యమంత్రి ఆలోచన - దేశానికే ఆదర్శం

​మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో దూరదృష్టితో ఆలోచించి ఈ చట్టాన్ని తీసుకువచ్చారని కొనియాడారు. "తల్లిదండ్రుల పోషణపై పిల్లల్లో భయం, భక్తి ఉండాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం. అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని మంత్రి పేర్కొన్నారు.

​అస్సాం చట్టం కంటే పదునైనది: డైరెక్టర్ శైలజ

​రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ మాట్లాడుతూ, తెలంగాణలో అమలవుతున్న ఈ చట్టం దేశంలోనే మరెక్కడా లేని విధంగా ఉందన్నారు. అస్సాం రాష్ట్రంలో ఉన్న చట్టం కంటే ఇది ఎంతో పదునైనదని, రిజిస్టర్ అయిన ప్రతి ప్రైవేటు సంస్థ ఉద్యోగి కూడా దీని పరిధిలోకి వస్తారని ఆమె స్పష్టం చేశారు.

​"వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ఆసరాగా నిలవడం ప్రతి బిడ్డ కనీస ధర్మం. ఆ బాధ్యతను విస్మరిస్తే ప్రభుత్వం ఉపేక్షించదు." > — అడ్లూరి లక్ష్మణ్ కుమార్