BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 07 August 2026, 06:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం: తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Aug, 2026 - 06:09 PM
64 వీక్షణలు

తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం: తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు

తిరువూరు: తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. తిరువూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు ఇవ్వడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్నారు. శిశువుకు తొలి ఆరు నెలల పాటు తల్లిపాలను మాత్రమే అందించాలని, అనంతరం అదనపు పోషకాహారంతో పాటు తల్లిపాలను కొనసాగించాలని సూచించారు. గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన కల్పించడంలో అంగన్వాడీ సిబ్బంది, ఐసీడీఎస్ అధికారులు కీలకపాత్ర పోషించాలని పేర్కొన్నారు.

గర్భిణులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు వైద్యుల సూచనలు పాటించాలని సూచించారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడన్నారు.

కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. తిరువూరు ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ ఆకుల దుర్గాప్రసాద్, ఏపీఎం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.