BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 April 2026, 10:13 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తొలి ప్రయత్నంలోనే జడ్జిగా ఎంపికైన కొమ్మూరు యువతి

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 10:13 AM
197 వీక్షణలు

తొలి ప్రయత్నంలోనే జడ్జిగా ఎంపికైన కొమ్మూరు యువతి – గ్రామంలో ఆనందోత్సాహాలు..!

గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన షేక్ రేష్మ ఆంధ్రప్రదేశ్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావడంతో గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. గుళ్లపల్లి మొహమ్మద్ ఖాశీం కుమార్తె, ముజావర్ మౌలాలి బాబు కోడలైన రేష్మ సాధించిన ఈ ఘన విజయం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులకు గర్వకారణంగా నిలిచింది.

తొలి ప్రయత్నంలోనే విజయం

రేష్మ 2024లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి, 2025లో నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జి పరీక్షకు హాజరై మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకోవడం విశేషంగా నిలిచింది. ఆమె కృషి, పట్టుదల, లక్ష్యసాధన పట్ల నిబద్ధత ఈ విజయానికి మూల కారణమని అందరూ అభిప్రాయపడుతున్నారు.

అభినందనల వెల్లువ

రేష్మ విజయం నేపథ్యంలో పలువురు ప్రముఖులు, న్యాయవాదులు, స్నేహితులు, గ్రామస్థులు ఫోన్ ద్వారా, సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. చిన్న గ్రామం నుంచి ఇంతటి ఉన్నత స్థాయికి ఎదగడం ఎంతో గొప్ప విషయమని కొనియాడుతున్నారు.

యువతకు ఆదర్శం

ఆమె సాధించిన ఈ విజయం గ్రామ యువతకు ప్రేరణగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించి సమాజానికి న్యాయం చేయాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.