BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 25 September 2025, 09:14 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

ఆ శ్రీమన్నారాయణుడు దుష్టులను శిక్షించడం కోసం శిష్టులను రక్షించడం కోసం ప్రతియుగంలో

తెలంగాణ
25 Sep, 2025 - 09:14 PM
407 వీక్షణలు
ఆ శ్రీమన్నారాయణుడు దుష్టులను శిక్షించడం కోసం శిష్టులను రక్షించడం కోసం ప్రతియుగంలో NTODAY NEWS: కదిరి నియోజవర్గం రిపోర్టర్ వినోద్ కుమార్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణంలో అవతారం దాలుస్తూ తన ఈ సర్వ మానవాళిని రక్షించుకుంటూ వస్తున్నారు.శ్రీ నరసింహ అవతారంలో హిరణ్యకశ్యపున్ని సంహరించిన అనంతరం తన ఉగ్రరూపం నుంచి శాంతింప చెయ్యాలని కోరుతూ భక్తప్రహ్లాదుడు , ముక్కోటి దేవతలు , ఋషులు ప్రార్థించగా ఆ నరసింహ స్వామి వారు ప్రశాంత లక్ష్మీ నరసింహుడు ఈ ఖాద్రీ పురాణంలో వెలసారని ప్రతీతి.ఈ ఖాద్రీపురంలో శ్రీ నరసింహ స్వామి వారు శ్రీ స్వామి వారు శ్రీదేవి భూదేవి ప్రహ్లాద సమేతంగా స్వయంభువుగా సండ్ర వృక్షంపై వెలసారని శ్రీ వారు మొదటగా స్తోత్రాద్రి అనగా కదిరి కొండపై పదం మోపారని 'ఖా' అనగా విష్ణుపాదం , 'అద్రి' అనగా పర్వతం అని అందుకే ఈ కదిరి కొండపై కాటమ రాయుడుగా , కొండల రాయుడుగా చెంచు లక్ష్మీ సమేతంగా శ్రీ కొండల లక్ష్మీ నరసింహుడుగా శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి 4 కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి కుమ్మర వాండ్లపల్లి గ్రామంలో వెలసారని శ్రీ వారి భక్తులు విశ్వసిస్తారు. ఇంతటి మహత్యం కలిగిన కదిరికొండకి శ్రీ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున పెద్దయెత్తున శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ తూర్పు రాజగోపురం నుంచి పాదయాత్రగా బయలుదేరి స్తోత్రాద్రికి హారతి ఇచ్చిన అనంతరం గోవింద నామస్మరణతో ,భజనలతో గిరిప్రదక్షిణ పూర్తి చేస్తారు.శ్రీ వారి గిరి ప్రదక్షిణకు విచ్చేస్తున్న భక్తులకు శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ అధికారులు, పట్టణ ప్రముఖులు వేణుగోపాల్,సురేంద్ర కుమార్, కార్తీక్, సుబ్రమణ్యం , విష్ణు వర్ధన్ , నామా రాము , బుల్లెట్ ఆచారి , తరుణ్ మరియు వారి కుటుంబ సభ్యులు అల్పాహారం ఏర్పాటు చేశారు.శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు మజ్జిగ , మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేసారు. ప్రతినెల స్వాతి నక్షత్రం రోజున శ్రీ వారి గిరి ప్రదక్షిణకు సుదూర ప్రాంతాల నుంచి పెద్దలు , పిల్లలు , మహిళలు పెద్దయెత్తున వేలసంఖ్యలో గిరి ప్రదక్షిణకు విచ్చేస్తున్నారు.గిరి ప్రదక్షిణకు సరైన రహదారి లేకపోవడం వల్ల శ్రీ వారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు కావున ఆలయ అధికారులు , ప్రభుత్వ అధికారులు , రాజకీయ నేతలు , పట్టణ ప్రముఖులు చొరవ తీసుకొని భక్తులు సరైన సదుపాయాలతో పాటుగా రహదారి మార్గాన్ని ఏర్పాటు చెయ్యాలని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.శ్రీ వారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఆ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీస్సులు కలగాలని శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి సభ్యుల కోరుకున్నారు. Follow us on Website Facebook Instagram YouTube