BREAKING
అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం
www.ntodaynews.com

విజయవాడ నగరాభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి

తెలంగాణ
14 Jan, 2026 - 09:04 AM
188 వీక్షణలు

విజయవాడ నగరాభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి: ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

ఎంపీ కార్యాలయంలో వైభవంగా సంక్రాంతి వేడుకలు NTODAY NEWS: విజయవాడ  విజయవాడ నగరాభివృద్ధిని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టితో నగరాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్‌లో బుధవారం ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భోగి మంటలు వెలిగించి, ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, మహిళా నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. భోగి వేడుకల ప్రారంభానికి ముందు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గద్దె అనురాధతో కలిసి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఎంపీ కేశినేని శివనాథ్ తన కుటుంబ సభ్యులు, ఎన్డీయే కూటమి నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. భోగి మంటల్లో గత వైసీపీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా జగన్ ఫోటోతో ఉన్న పాస్ పుస్తకాల ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను ఇప్పుడు అదే పార్టీ నేతలే భోగి మంటల్లో వేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు సంబంధించిన ఆస్తులపై జగన్ బొమ్మ ముద్రించడం సరికాదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తొలగించి రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు జారీ చేసినట్లు తెలిపారు. విజయవాడలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టడంతో పాటు, నగర మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నామని, నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు బొప్పన భవ కుమార్, జంపాల సీతారామయ్య, రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా, ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, ఎన్టీఆర్ జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు చలసాని రమణ, ఎస్సీ సెల్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల నాయకులు, ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #VijayawadaDevelopment #SankrantiCelebrations #NDAAlliance #TDP #ChandrababuNaidu #KesineniShivanath #NTodayNews #FestivalPolitics Follow us on Website Facebook Instagram YouTube