BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 07 February 2026, 01:13 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పాలకుర్తిలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ ఘన విజయం

తెలంగాణ
07 Feb, 2026 - 01:13 AM
307 వీక్షణలు
పాలకుర్తిలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ ఘన విజయం సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి NTODAY NEWS: పాలకుర్తి రిపోర్టర్: వేణు పాలకుర్తి నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. గృహ నిర్మాణ రంగంలో పేదలు, బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా అనేక సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. గత పాలనలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకు కాంగ్రెస్ పాలనలో పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతులు, అభివృద్ధి పనులు మరింత వేగంగా చేపడతామని హామీ ఇచ్చారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, మున్సిపాలిటీ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని తెలిపారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం వంటి అంశాల్లో ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, మిగిలిన అభివృద్ధి పనులు త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచి రాబోయే ఎన్నికల్లో పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజలతో నేరుగా అనుసంధానమై పనిచేస్తోందని పేర్కొన్నారు. ఇంటింటి ప్రచారం, కార్నర్ మీటింగ్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని ప్రభుత్వానికి చేరవేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడేది కాంగ్రెస్ పార్టీనే అని స్పష్టం చేశారు. ఈ కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువతతో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. #Palakurthi #CongressMeeting #CornerMeeting #TelanganaPolitics #PublicWelfare #DevelopmentAgenda #NtodayNews Follow us on Website Facebook Instagram YouTube