BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

జగిత్యాల ఎస్సీ స్టడీ సర్కిల్‌ను పరిశీలించిన మాజీ మంత్రి

తెలంగాణ
07 Jan, 2026 - 03:18 AM
188 వీక్షణలు

జగిత్యాల ఎస్సీ స్టడీ సర్కిల్‌ను పరిశీలించిన మాజీ మంత్రి కొప్పుల

NTODAY NEWS: జగిత్యాల జిల్లా కేసీఆర్ పాలనలో ఎస్సీ స్టడీ సర్కిళ్లు సూపర్ సక్సెస్: కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా కేంద్రంలో రెండు సంవత్సరాలుగా ప్రవేశాలు లేక మూతపడిన ఎస్సీ స్టడీ సర్కిల్‌ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం ఎస్సీ స్టడీ సర్కిళ్లు వెలుగువెలిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత అవి క్రమంగా నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా స్టడీ సర్కిళ్లలో రెండు సంవత్సరాలుగా బోధన నిలిచిపోయి, ప్రవేశాలు లేక దయనీయ స్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల స్టడీ సర్కిల్ దారుణ పరిస్థితి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌కు 2024 ఆగస్టు 17 నుంచి అడ్మిషన్లు లేక మూతపడిందని తెలిపారు. నిధుల మంజూరు లేకపోవడం, భవన అద్దె, ఇతర వసతుల కొరత కారణంగా కేంద్రానికి తాళాలు పడిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెలకు రూ.1.28 లక్షల అద్దె చెల్లించేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అద్దె చెల్లింపులు నిలిచిపోయి దాదాపు 15 నెలల బకాయిలు పేరుకుపోయాయని చెప్పారు. భవన యజమానుల ఒత్తిడితో డిసెంబర్ నెల రెండో వారంలో కేవలం మూడు నెలల అద్దె మాత్రమే విడుదల చేసినట్లు తెలిపారు. డైరెక్టర్‌, అకౌంటెంట్‌, ఇతర సిబ్బందికి ఏడాదిగా వేతనాలు అందడం లేదని, పలువురు ట్యూటర్లకు లక్షలాది రూపాయల బోధన రుసుములు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన శిక్షణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 ఎస్సీ స్టడీ సర్కిళ్లలో హైదరాబాద్‌ను మినహాయిస్తే మిగిలిన అన్ని కేంద్రాల్లో 17 నెలలుగా శిక్షణ పూర్తిగా నిలిచిపోయిందన్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో రెండు బ్యాచ్‌లను నిర్వహించాల్సి ఉండగా, ఆ విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో సూపర్ సక్సెస్ స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లక్ష్యంగా ఎస్సీ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేశారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున 33 జిల్లాల్లో మొత్తం 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేశారని తెలిపారు. స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలుగా కాకుండా, ఉద్యోగ భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చేశామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గతంలో హైదరాబాద్‌లో ఒక్క ఎస్సీ స్టడీ సర్కిల్ మాత్రమే ఉండేదని గుర్తు చేశారు. జగిత్యాల స్టడీ సర్కిల్ విజయాలు జగిత్యాలలో రూ.1.20 కోట్లతో ఎస్సీ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి బ్యాచ్‌లో 45 మంది మహిళలు, 45 మంది పురుషులు కలిపి మొత్తం 90 మందికి ఉచిత వసతి, భోజనంతో ఐదు నెలల పాటు శిక్షణ అందించామని చెప్పారు. శిక్షణ సమయంలోనే టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1, పోలీస్ ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేషన్లు విడుదల కావడంతో విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ బ్యాచ్‌లో 10 మంది గ్రూప్–1 మెయిన్స్‌కు, 32 మంది ఎస్సై మెయిన్స్‌కు ఎంపికై విశేష ఫలితాలు సాధించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగార్థులతో కళకళలాడిన ఎస్సీ స్టడీ సర్కిళ్లు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మూతపడడం దురదృష్టకరమని అన్నారు. కనీసం భవన అద్దె కూడా చెల్లించలేని పరిస్థితిలో ఏడాదిగా తాళాలు వేసి ఉంచడం వల్ల నిరుద్యోగ యువతలో తీవ్ర అసహనం పెరుగుతోందని హెచ్చరించారు. తక్షణమే ఎస్సీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ తరగతులను పునఃప్రారంభించాలని, పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని సంబంధిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను డిమాండ్ చేశారు. Follow us on Website Facebook Instagram YouTube