BREAKING
స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన
www.ntodaynews.com

పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

తెలంగాణ
13 Jun, 2025 - 09:20 AM
402 వీక్షణలు
పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం--భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి NTODAY NEWS: బీబీనగర్ అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు మంజూరు చేయడం జరుగుతుందని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం రోజున బీబీనగర్ మండల కేంద్రంలో పి.ఆర్.జి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు తో కలిసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా భువనగిరి శాసన సభ్యులు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులందరికి నిలువ నీడను కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశపెట్టిందన్నారు. పేదల సొంత ఇంటి కలను ప్రభుత్వం దశలవారీగా నెరవేరుస్తుందని ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరవుతాయన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఒక పండుగ వాతావరణంగా ఉందన్నారు. నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమైనప్పుడే కుటుంబా లు బాగుంటాయని అన్నారు.రేకులు, పైకప్పులు లేని నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటూ బేస్మెంట్ కట్టుకున్న వారికి లక్ష రూపాయలు,లెంటల్ లెవెల్ వరకు నిర్మించుకున్న వారికి మరో లక్ష రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ఈ విధంగా మొత్తంగా ప్రతి ఇంటికి ఐదు లక్షలు అందజేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం లబ్ధిదారులకు ఇల్లు కట్టుకునేందుకు ఇసుక, ఎలాంటి కొరత లేకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ పడుతుందన్నారు. ప్రతి పేద ప్రజలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా అర్హులైన ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. నిలువ నీడను కల్పించాలని గొప్ప ఉద్దేశంతో ప్రభుత్వం గొప్ప పథకం ప్రవేశపెట్టిందన్నారు. దశలవారీగా లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరవుతాయన్నారు. ఇండ్లు కట్టుకునే ప్రతి పేద వారు తొందరగా బేస్మెంట్ పూర్తి చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న 5 లక్షల సహాయం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, మండల స్పెషల్ అధికారి సుభాషిని, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube