BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 22 April 2025, 08:37 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఓబీసీ,బీసీ ఉద్యోగులకు క్రిమిలేయర్ తొలిగించాలి

తెలంగాణ
22 Apr, 2025 - 08:37 AM
413 వీక్షణలు
ఓబీసీ,బీసీ ఉద్యోగులకు క్రిమిలేయర్ తొలిగించాలి. ఓబీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు వరప్రసాద్ యాదవ్ విజయవాడ: కేంద్ర ప్రభుత్వం ఓబీసీ, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు.మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వరప్రసాద్ యాదవ్, రాష్ట్ర ఓబీసీ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ శ్రీదేవి యాదవ్ తో కలసి మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ లకు వలే ఓబీసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు ఓబీసి వర్గానికి చెందిన ప్రధాని నరేంద్ర మోదీ భాద్యత తీసుకోవాలనీ వరప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు, బీసీ, ఓబీసీ ఉద్యోగులకు క్రెమిలేయర్ విధానం అమలు చేయటం సమంజసం కాదన్నారు, కేంద్రంలో ఓబీసీ లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీ పై ఒత్తిడి తేవాలని వరప్రసాద్ యాదవ్ విజ్ఞప్తి చేశారు ఏపీ రాష్ట్రంలో బీసీ కులాల మహిళల పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని వరప్రసాద్ యాదవ్ సీఎం చంద్రబాబు నాయుడును కోరారు. ఓబీసీ మహిళా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా శ్రీదేవి యాదవ్. ఓబీసీ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ గా శ్రీదేవి యాదవ్ ను నియమిస్తూ జాతీయ అధ్యక్షులు వరప్రసాద్ యాదవ్ నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన శ్రీదేవి యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 63 ప్రభుత్వ శాఖలలో ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ను బలోపేతం చేయడం ద్వారా బీసీ ఉద్యమం ను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తానని తెలిపారు.తనని ఓబీసీ మహిళా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా నియమించిన ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షులు వరప్రసాద్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఓబీసీ ,బీసీ ఉద్యోగుల క్రిమిలేయర్ సీలింగ్ పరిమితిని తక్షణమే రూ 11 లక్షలకు పెంచాలని శ్రీదేవి డిమాండ్ చేశారు. ఈ విలేకర్ల సమావేశంలో ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సుజాన్ సింగ్, విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథ్,ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి జి.మాధవ రావు , డిఆర్ యూసీసీ సభ్యులు కాకు బాల నారాయణ, మహిళ సంఘం రాష్ట్ర కార్యదర్శిఎం .అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి యాదవ్ ను పలు శాఖల బీసీ ఉద్యోగులు శాలువాలతో అభినందించారు. Follow us on Website Facebook Instagram YouTube