BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 17 January 2026, 09:00 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మహిళల ఆర్థికాభివృద్ధికి ఏపీలో తొలి అడుగు

తెలంగాణ
17 Jan, 2026 - 09:00 AM
380 వీక్షణలు

ఇబ్రహీంపట్నం గుంటుపల్లిలో రైజ్ సెంటర్ ఏర్పాటు

మహిళల ఆర్థికాభివృద్ధికి ఏపీలో తొలి అడుగు NTODAY NEWS: ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడే విధంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో రైజ్ సెంటర్ ఏర్పాటు చేశారు. చేతి వృత్తుల ద్వారా ఉత్పత్తులు తయారు చేసి, వాటికి మార్కెటింగ్ కల్పిస్తూ మహిళలను చిన్నతరహా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ కేంద్రం లక్ష్యం. ఈ రైజ్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ లక్ష్మీశా సందర్శించి మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. వారు ఎదిగిన విధానం, శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గుంటుపల్లిలో రైజ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి గత జులై నుంచి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలను చిన్నతరహా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన “వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్‌ప్రెన్యూర్” నినాదాన్ని అమలు చేసేలా ఈ కేంద్రం పనిచేస్తోందని తెలిపారు. మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని గుర్తించి, ప్రోత్సహించి, వారు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రైజ్ సెంటర్‌లో మహిళలు కంప్యూటర్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్ వంటి కోర్సులను ఉచితంగా నేర్చుకునే సౌకర్యం ఉందని తెలిపారు. వివిధ రంగాల్లో ప్రతిభ ఉన్న మహిళలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, పరస్పర సహకారంతో మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగేలా ప్రోత్సహిస్తున్నామని వివరించారు. #RiseCenter #WomenEmpowerment #WomenEntrepreneurs #SelfHelpGroups #SkillDevelopment #OneFamilyOneEntrepreneur #RuralDevelopment #WomenInBusiness #NTRDistrict #Ibrahimpatnam #AndhraPradesh #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube