www.ntodaynews.com
నరేంద్ర మోడీ తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాల్సిందే
తెలంగాణ
నరేంద్ర మోడీ తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాల్సిందే,
కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు ర్యాకల శ్రీశైలం డిమాండ్
N TODAY NEWS: బొమ్మలరామారం
నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ర్యాకల శ్రీశైలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రోజున జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మె కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బొమ్మలరామారం మండలంలో కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అనంతరం సభ నిర్వహించారు. నరేంద్ర మోడీ విధానాలు నశించాలని , లేబర్ కోడ్ లు రద్దు చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ బొమ్మలరామారం మండల కేంద్రంలో గుడి భావి చౌరస్తాలో రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు ర్యాకల శ్రీశైలం మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ ల వల్ల కార్మికుల 8 గంటల పని కాస్తా 12 గంటలుగా మారుతుందని,ఏ యూనియన్ ఏర్పాటు చేయాలన్న 100 (వంద ) మంది కార్మికులు లేదా 10 శాతం కావాలని లేబర్ కోడ్ లు చెప్తున్నాయని ఇక యూనియన్ ఏర్పాటు ప్రశ్నార్ధకమే అని అందుకే లేబర్ కోడ్ లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ ఎన్నికలలో 51 శాతం పైగా ఓట్లు వస్తేనే గుర్తింపు యూనియన్ గా లెక్కిస్తామని చెప్పడం ,ట్రేడ్ యూనియన్ నాయకులు 05 మందికి మించి ఉండకూడదని నిబంధన పెట్టి పరిశ్రమలో పనిచేసేవారిపై వత్తిడి చేసే విధంగా చేయడం కార్మికులకు ఉన్న ప్రజాస్వామిక హక్కును హరించడమే అన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు హాజరై మాట్లాడుతూ వేతనాల కోడ్ లో ఉన్న వేతనం పేరు కోడ్ లో ఎక్కడ వేతనాలను ఎలా నిర్ణయిస్తారు దేశం మొత్తం కరోనా లో ఉంటే మోడీ ప్రభుత్వం మాత్రం కార్పోరేట్ ల సేవలో లేబర్ కోడ్ లను కనీసం పార్లమెంట్ లో చర్చకు అవకాశం ఇవ్వకుండా మూడు లేబర్ కోడ్ లను తెచ్చిందని విమర్శించారు. లేబర్ కోడ్ ల రద్దు కోసం రానున్న కాలంలో మరిన్ని పోరాటాలు చేయడం కోసం సిద్ధం కావాలని కార్మికులకు పిలునిచ్చారు. ఈ ర్యాలీ,సభ కార్యక్రమంలో మండల నాయకులు బాలరాజ్, మణెమ్మ, అంగన్వాడీ టీచర్ నాగమణి, ప్రమీల, మంజుల, రేణుక, సుజాత, శ్రీలత, భవాని, సంతోష్, గోవిందమ్మ, ఉమారాణి, సబిత తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube