BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 01 January 2026, 09:28 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా నూతన సంవత్సర ప్రత్యేక ప్రార్థనలు

తెలంగాణ
01 Jan, 2026 - 09:28 AM
209 వీక్షణలు

శాఖపూర్ మెస్సియా సమాజ మందిరంలో ఘనంగా నూతన సంవత్సర ప్రత్యేక ప్రార్థనలు

NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ జగిత్యాల జిల్లా: వెల్గటూర్ మండలం శాఖపూర్ గ్రామంలోని మెస్సియా సమాజ మందిరంలో 2026 నూతన సంవత్సర వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆధ్యాత్మిక సందేశం చర్చీ పాస్టర్లు జాన్ మహేష్, సంతోష్, నాతనీలు ఈ వేడుకల్లో పాల్గొని భక్తులకు దైవ సందేశాన్ని అందించారు. ఆదికాండము 17:1 వచనంలోని “నేను సర్వశక్తిగల దేవుడను (ఎలోహిం)” అనే అంశంపై ప్రత్యేక వాక్యాన్ని బోధించారు. చర్చీ నిర్మాణ ప్రారంభం నుండి దేవుడు చూపిస్తున్న కృపను గుర్తుచేస్తూ, నూతన సంవత్సరంలో అందరూ దైవ చింతనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కీర్తనలు క్రైస్తవ సోదరీమణులు భక్తి పాటలతో యేసయ్యను స్తుతించగా, చిన్నారులు తబలా వాయిద్యాలతో ఆకట్టుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అందరూ కలిసి కేక్ కట్ చేసి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ క్రీస్తు ప్రేమను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మోకేనాపల్లి గోపి, ఎనగందుల రవి, గాజుల అనిల్, ఉపారపు రాములు, గాజుల రాజయ్య, గాజుల లక్ష్మి–రాజాం, ఉపారపు శ్రీధర్‌తో పాటు పెద్ద సంఖ్యలో విశ్వాసులు, సోదరీమణులు, చిన్నారులు పాల్గొన్నారు. అందరూ భక్తిశ్రద్ధలతో ప్రార్థనల్లో పాల్గొని నూతన సంవత్సర దీవెనలు అందుకున్నారు. తమ దేవునికి యుగయుగములు మహిమ కలుగును గాక అని దైవజనులు ఆకాంక్షించారు. Follow us on Website Facebook Instagram YouTube