BREAKING
గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
Date of Publish : 01 February 2026, 08:11 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా వారిజాల వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం

తెలంగాణ
01 Feb, 2026 - 08:11 AM
402 వీక్షణలు
ఘనంగా వారిజాల వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం NTODAY NEWS: నార్కట్‌పల్లి నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం గోపులాయపల్లి గ్రామంలో కొలువైన శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైభవంగా కళ్యాణ ఘట్టాలు కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఉదయం గణపతి పూజ, పల్లకి సేవ, ఎదుర్కోలు, అనంతరం కళ్యాణ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు వెంకటాచార్యులు మాట్లాడుతూ, మాఘమాస పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణం జరపడం అత్యంత విశేషమని తెలిపారు. ‘వారిజాల’ అంటే ప్రవహించే నీరు అని, ఆ జలములోనే స్వామి ఉద్భవించారని వివరించారు. బ్రహ్మోత్సవాలు మొత్తం ఎనిమిది రోజులపాటు కొనసాగుతాయని, ఆదివారం కళ్యాణ మహోత్సవం, ఈ నెల 4వ తేదీన రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతిరోజూ హనుమాన్ వాహన సేవ, శేష వాహన సేవ, గరుడ వాహన సేవలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. స్వామివారి కళ్యాణాన్ని దర్శించిన భక్తులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని అన్నారు. గోవింద నామస్మరణతో మార్మోగిన గోపులాయపల్లి కళ్యాణ సమయంలో గోపులాయపల్లి కొండ ప్రాంతం గోవింద నామస్మరణతో మార్మోగింది. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ, రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు ఈ సందర్భంగా సీఐ నాగరాజు మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తుల భద్రత కోసం సుమారు 300 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళల రక్షణ కోసం షీ-టీమ్‌లను కూడా మోహరించినట్లు చెప్పారు. #VarijalaVenugopalaSwamy #Brahmotsavams #KalyanaMahotsavam #NalgondaNews #Narketpally #TempleFestival #DevotionalNews Follow us on Website Facebook Instagram YouTube