BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 February 2026, 11:15 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఎస్సీ–ఎస్టీ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానం

తెలంగాణ
06 Feb, 2026 - 11:15 AM
314 వీక్షణలు
పుంగనూరులో ఎస్సీ–ఎస్టీ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన స్వాగతం NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు  ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ–ఎస్టీ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు పాలకుంట్ల శ్రీనివాసులను పుంగనూరులో ఘనంగా సన్మానించారు. పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం, తాసిల్దార్ (ఎంఆర్‌వో) రాము ఆదేశాల మేరకు పూలమాల, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర దళిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. శంకరప్ప మాట్లాడుతూ, ఎస్సీ–ఎస్టీల సమస్యల పరిష్కారానికి పుంగనూరు తాసిల్దార్ కార్యాలయంలో ప్రతి నెలా ఎస్సీ–ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించడం రాష్ట్రంలోనే అరుదైన కార్యక్రమమని పేర్కొన్నారు. ఈ నెల జరగబోయే మానిటరింగ్ కమిటీ సమావేశానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. ఎస్సీ–ఎస్టీల సమస్యలను నెలకు ఒక్కసారి సమీక్షించి పరిష్కరించే విధంగా మానిటరింగ్ కమిటీ సమావేశాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రజా సంఘాలన్నీ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్.ఆర్. అశోక్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బి. నరసింహులు, దళిత సీనియర్ నాయకులు ఏ. కుమార్, కొర్లరామయ్య, కంగానెల్లూరు రమణ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎం. కృష్ణప్ప, ఎస్సీ–ఎస్టీ కమిటీ సభ్యులు రాజా, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి చెన్నారాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్. నాగరాజా, ఎస్టీ నాయకుడు మనోజ్ నాయక్, ఎండీపీఎస్ నాయకుడు రమణ, మారెమ్మ గుడి రెడ్డప్ప, మార్లపల్లి సుబ్రమణ్యం, కంటే పల్లి గంగరాజు, వనమలదిన్ని రమణ, ఎం. కుర్పల్లి వెంకటరమణతో పాటు పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు. #SCSTRights #DalitWelfare #AmbedkarCircle #Punganur #PublicMovements #SocialJustice #SCSTMonitoringCommittee #NtodayNews Follow us on Website Facebook Instagram YouTube