BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 14 June 2026, 02:36 pm
Posted by : V శ్రీనివాస్

ఉద్యమ కళాకారుల సేవలు తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
14 Jun, 2026 - 02:36 PM
166 వీక్షణలు

మంచిర్యాల, జూన్ 14: తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ కళాకారులు పోషించిన పాత్ర ఎంతో గొప్పదని, వారి ఆటపాటలు, త్యాగాలు రాష్ట్ర చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఉద్యమ కళాకారుల సన్మాన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలువురు ఉద్యమ కళాకారులను శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

​అనంతరం ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని పల్లెపల్లెకూ తీసుకెళ్లి ప్రజల్లో అపారమైన చైతన్యం నింపడంలో కళాకారుల కృషి విశేషమైనదని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం వారి సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, తెలంగాణ సాధన కోసం పోరాడిన ప్రతి ఒక్కరి సేవలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు