BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 02 February 2026, 08:35 am
Posted by : NTODAY NEWS OFFICIAL

యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన

తెలంగాణ
02 Feb, 2026 - 08:35 AM
396 వీక్షణలు
నాణ్యమైన ఆహారం కోసం యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన వండిన అన్నంతో రాష్ట్ర రహదారిపై బైఠాయించిన విద్యార్థులు NTODAY NEWS: నార్కట్‌పల్లి నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థుల భోజనంలో గుట్కా ప్యాకెట్ బయటపడటం తీవ్ర కలకలం రేపింది. యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు ఉదయం అందించిన జీరా రైస్‌లో గుట్కా ప్యాకెట్ లభించడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నార్కట్‌పల్లి–అద్దంకి రాష్ట్ర రహదారిపై వండిన అన్నంతో బైఠాయించి ఆందోళన చేపట్టారు. సుమారు మూడు గంటల పాటు కొనసాగిన నిరసనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ గతంలో కూడా అన్నంలో క్రిమికీటకాలు బయటపడిన సంఘటనలు ఉన్నప్పటికీ యూనివర్సిటీ యాజమాన్యం, ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల ఆరోగ్యం కంటే హాజరు శాతానికే ప్రాధాన్యం ఇస్తూ పునరావృతమవుతున్న సమస్యలపై స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన ఆహారం అందించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వైస్ ఛాన్సలర్‌ను పిలిపించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు చత్రపతి చౌహన్, హనుమాన్, మౌనిష్ సూర్య, మోహన్, సుధీర్, అజయ్, సతీష్, విజయ్, శంకర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. #UniversityStudents #QualityFood #StudentProtest #FoodSafety #ABVP #MahathmaGandhiUniversity #Nalgonda #StudentIssues #CampusNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube