BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 15 April 2026, 06:16 pm
Posted by : కూనురు మధు

వాహనదారుల భద్రతే ప్రాధాన్యం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
15 Apr, 2026 - 06:16 PM
169 వీక్షణలు

వాహనదారుల భద్రతే ప్రాధాన్యం : రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి NTODAY NEWS చిట్యాల 

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించి, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వేలిమినేడు వద్ద 65 వ నంబర్ జాతీయ రహదారి నల్లగొండ జిల్లా పోలీస్ యంత్రాంగం ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాదాల అవగాహన హోర్డింగ్‌ను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ​ఈ కార్యక్రమంలో డీజీపీతో పాటు డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.​హోర్డింగ్ ప్రారంభోత్సవం అనంతరం డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ రహదారులపై నిబంధనలు పాటించకపోవడం వల్లే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ల ముఖ్యంగా రాత్రి వేళల్లో గూడ్స్ వాహనాల వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు ​రేడియం స్టిక్కర్లు తప్పనిసరి అని పేర్కొన్నారు. జాతీయ రహదారిపై ప్రయాణించే ప్రతి గూడ్స్ క్యారియర్ వాహనానికి కస్సాన్ రేడియం స్టిక్కర్లు మరియు రేర్ మార్కింగ్ ప్లేట్స్ కచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌ను డీజీపీ ఆదేశించారు వేలిమినేడు సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి డీజీపీ శివధర్ రెడ్డిని కలిసి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. జాతీయ రహదారి 65పై ఉన్న పిట్టంపల్లి క్రాస్ వద్ద చీకటి కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అక్కడ తక్షణమే హైమాస్ట్ లైటింగ్ ఏర్పాటు చేసి వాహనదారుల ప్రాణాలను కాపాడాలని ఆయన కోరారు. దీనిపై డీజీపీ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సీఐ నాగరాజు, చిట్యాల ఎస్ఐ రవికుమార్, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు