BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 18 April 2026, 05:40 pm
Posted by : కూనురు మధు

వామ్మో మట్టి టిప్పర్లు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
18 Apr, 2026 - 05:40 PM
610 వీక్షణలు

వామ్మో మట్టి టిప్పర్లు NTODAY NEWS చిట్యాల 

పెద్ద కాపర్తి మట్టి టిప్పర్లతో  నిద్రలేని రాత్రులు గడుపుతున్న గ్రామస్థులు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో మట్టి  రవాణా చలవిడిగా సాగుతోంది. గత వారం రోజులుగా పెద్ద కాపర్తి  రోడ్లపై టిప్పర్ల మోత మోగుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించిందో లేక చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారో అర్థం కాక గ్రామస్థులు వాపోతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జాతీయ రహదారిపై నుండి  భారీ ఎత్తున నల్లమట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు అని,  పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిరంతరాయంగా ఈ రవాణా సాగుతోంది అని. అనుమతులు ఉన్నాయా లేదా అన్నది పక్కన పెడితే, నిబంధనలకు విరుద్ధంగా జనసంచారం ఉన్న వీధుల్లో ఈ భారీ వాహనాలు తిరగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

* ​గ్రామమా ? జాతీయ రహదారా?

​టిప్పర్ల రాకపోకలతో పెద్దకాపర్తి గ్రామం కాస్తా జాతీయ రహదారిని తలపిస్తోంది. టిప్పర్లు గ్రామ వీధుల్లో విపరీతమైన వేగంతో ప్రయాణిస్తుండటంతో దుమ్ము ధూళి రేగి ఇళ్లు అపరిశుభ్రంగా మారుతున్నాయి. చిన్నారులు, వృద్ధులు రోడ్డు మీదకు రావాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

* ​ధ్వని కాలుష్యం:

అర్ధరాత్రి వేళల్లో కూడా టిప్పర్ల శబ్దాలతో గ్రామస్థులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. అని వాపోతున్నారు.. మేము  గ్రామంలో ఉంటున్నామో లేక హైవే పక్కన ఉంటున్నామో అర్థం కావడం లేదు. పిల్లల్ని బయటకు పంపాలంటే భయమేస్తోంది అని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి ఈ తమ గ్రామం నుండి మట్టి రవాణాను అరికట్టాలి అని వేడుకుంటున్నారు.

​అధికారులు స్పందించేనా?

​ మట్టిని తరలిస్తూ, నిబంధనలు అతిక్రమిస్తూ సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దకాపర్తి గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ మరియు పోలీస్ యంత్రాంగం తక్షణమే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, పెద్ద కాపర్తి గ్రామం నుండి  ఈ 'మట్టి' దందాను అరికట్టాలని కోరుతున్నారు.