BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 19 August 2026, 10:26 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వాయుగుండం ప్రభావం.. ఏపీలో వర్షాల జోరు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 10:26 AM
132 వీక్షణలు

వాయుగుండం ప్రభావం.. ఏపీలో వర్షాల జోరు

పలు జిల్లాలకు వర్ష సూచన.. సముద్రం అల్లకల్లోలం

ఆంధ్రప్రదేశ్‌పై వాయుగుండం ప్రభావం కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి జార్ఖండ్ వైపు కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

నేటి నుంచి 23వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆగస్టు 19 వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

ఇప్పటికే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. హుకుంపేట, పెదబయలు ప్రాంతాల్లో వర్ష ప్రభావం కనిపించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.