BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 March 2026, 07:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వేసవికాలంలో మూగజీవాల కోసం నీటి తొట్టెల ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 07:35 PM
150 వీక్షణలు

వేసవికాలంలో మూగజీవాల కోసం నీటి తొట్టెల ఏర్పాటు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: మండల పరిధిలోని పలు గ్రామాల్లో వేసవికాలం నేపథ్యంలో మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీల సహకారంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

వావిలాల, రాజుగూడెం, మునుకొల్ల, వామకుంట్ల, లక్ష్మీపురం, రామన్నపాలెం, కాకర్ల, కోకిలంపాడు, మల్లెల గ్రామాల్లో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పక్షుల కోసం ప్రత్యేకంగా నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పశువైద్యాధికారి డాక్టర్ అభిలాష్ స్వయంగా పర్యవేక్షించారు.

వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో మూగజీవాలకు తాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యగా ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమానికి సహకరించి, పశువుల సంరక్షణలో భాగస్వాములయ్యారు.