BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 26 June 2026, 01:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో భక్తులకు గుడ్‌న్యూస్.. నెరవేరిన చిరకాల కోరిక!

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 01:17 PM
95 వీక్షణలు

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో అత్యాధునిక సౌకర్యాలతో నూతన డిస్పెన్సరీని ప్రారంభించింది. ఇకపై క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే వైద్యసేవలు అందనున్నాయి.

ఈ డిస్పెన్సరీలో ఈసీజీ యంత్రాలు, ఆక్సిజన్ సపోర్ట్ సిస్టమ్స్, అత్యవసర వైద్య పరికరాలను అందుబాటులో ఉంచారు. 24 గంటలపాటు నలుగురు వైద్యులు, 16 మంది పారామెడికల్ సిబ్బంది విధులు నిర్వహించనుండగా, అవసరమైతే అశ్విని ఆసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్‌ను కూడా సిద్ధంగా ఉంచారు.

క్యూ లైన్లలో వృద్ధులు, చిన్నారులు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఈ కేంద్రం ప్రాణరక్షణగా మారనుంది. అత్యవసర సమయాల్లో వైద్యం కోసం దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా అక్కడికక్కడే చికిత్స అందించగలగడం ఈ కేంద్రం ప్రత్యేకత.

భక్తుల సౌకర్యం, భద్రతకు పెద్దపీట వేస్తూ టీటీడీ చేపట్టిన ఈ చర్యపై యాత్రికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత సురక్షితమైన, సౌకర్యవంతమైన యాత్ర అందుబాటులోకి రానుంది.