BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 29 June 2026, 06:02 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వీడు మనిషి కాదు.. నరమాంస భక్షకుడు! ఆసుపత్రుల నుంచి మానవ అవయవాలు దొంగిలించి వండుకుని తిన్న ఉద్యోగి

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jun, 2026 - 06:02 AM
143 వీక్షణలు

హంగేరీ దేశ రాజధాని బుడాపెస్ట్లో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల ఆసుపత్రి ఉద్యోగి నరమాంస భక్షకుడిగా పోలీసులకు చిక్కాడు.

పోలీసుల విచారణలో అతడు ఆసుపత్రులు, శ్మశానవాటికల నుంచి మానవ శరీర భాగాలను దొంగిలించి తన అపార్ట్‌మెంట్‌లో దాచుకున్నట్లు, వాటిలో కొన్ని భాగాలను వండుకుని తిన్నట్లు అంగీకరించినట్లు సమాచారం.

నిందితుడి నివాసంలో పోలీసులు మానవ ముఖం, చర్మం, కాలు, చేయి, మెదడు, పుర్రెలు, ఎముకలు, గుండె తదితర అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు.

మానవ శరీర నిర్మాణ శాస్త్రంపై ఉన్న ఆసక్తి కారణంగానే ఈ చర్యలకు పాల్పడ్డానని నిందితుడు తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న అవశేషాలు ఎవరెవరివో గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన హంగేరీలో తీవ్ర సంచలనం రేపింది.