BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 June 2026, 04:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వెన్నుపోటు కాదు... ప్రజల వెన్నంటి నిలిచిన పాలనకు రెండేళ్లు! పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 04:17 PM
122 వీక్షణలు


– పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు

2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును "వెన్నుపోటు"గా అభివర్ణించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రజల ఓటుతో ఏర్పడిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి ఉన్నప్పటికీ, ప్రజల తీర్పును వక్రీకరించే హక్కు ఎవరికీ లేదన్నారు.

జగన్ ఇంకా భ్రమల్లోనే జీవిస్తున్నారని, 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చింది సాధారణ ఓటమి కాదని, గత ఐదేళ్ల పాలనలో జరిగిన అవినీతి, అరాచకాలు, ప్రజావ్యతిరేక నిర్ణయాలకు విధించిన చారిత్రాత్మక శిక్ష అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడవలేదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఓటుతో గట్టి గుణపాఠం చెప్పారని అన్నారు.

వైసీపీ హయాంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఉద్యోగులు, రైతులు, యువత, విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. నవరత్నాల పేరుతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, భవిష్యత్తు తరాలపై భారీ ఆర్థిక భారం మోపారని విమర్శించారు. అందుకే ప్రజలు వైసీపీని కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితం చేశారని పేర్కొన్నారు.

ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన కక్షసాధింపు రాజకీయాలు రాష్ట్రాన్ని అరాచకం, అవినీతి, దోపిడీ వైపు నడిపించాయని అన్నారు. ఇసుక దోపిడి, మద్యం మాఫియా, గంజాయి వ్యవహారాలు, పోలవరం నిర్లక్ష్యం, భూ అక్రమాలు వంటి అంశాలన్నింటినీ ప్రజలు గమనించారని చెప్పారు.

ఇప్పటికీ అబద్ధపు ప్రచారాలు, పుస్తకాల విడుదలల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రజలు ఒకసారి మోసపోవచ్చు కానీ ప్రతిసారి కాదని, 11 సీట్లు ప్రజలు ఇచ్చిన హెచ్చరిక మాత్రమేనని, ఇంకా మార్పు రాకపోతే వైసీపీ భవిష్యత్తు మరింత క్లిష్టంగా మారుతుందని హెచ్చరించారు.

జగన్ తన పాలనపై ఆత్మపరిశీలన చేసుకోవాలని, ప్రజల తీర్పును గౌరవించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులని, వారి తీర్పును అవమానించే వారికి రాజకీయంగా స్థానం ఉండదన్నారు.

కూటమి ప్రభుత్వం చట్టబద్ధంగా, పారదర్శకంగా పాలన సాగిస్తోందని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై చట్ట ప్రకారం విచారణ జరుగుతుందని తెలిపారు. ఎవరైనా చట్టానికి అతీతులు కారని, తప్పు చేసిన వారు తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలు, అసత్య ప్రచారాలు మానేసి వాస్తవాలను అంగీకరించాలని, లేకపోతే ప్రజల తీర్పు మరోసారి మరింత కఠినంగా ఉంటుందని పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.